సినిమా ఇండస్ట్రీ మొత్తం హీరోల చుట్టూనే తిరుగుతోంది. హీరోకి నచ్చిందే కథ, మెచ్చినవాడే డైరెక్టర్. వాళ్ళ చూపు పడిన వాడే నిర్మాత. నెంబర్ వన్ హీరో దగ్గర నుంచి మీడియ్ రేంజ్ హీరోల వరకూ ఇలాగే ప్రవర్తిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కొత్త గా వస్తున్న హీరోలు.. కొత్త నిబంధనలు రాసిపెట్టారు. వీరికి ఆద్యుడు అడవి శేషు . అతను డైరెక్టర్ గా, ప్రొడ్యూసర్ గా ఫెయిల్ అయ్యారు. హీరో అయినా అతనిలోని కథా రచయిత నిద్ర పోవడం లేదు. ‘ క్షణం’ సినిమా హిట్ అయ్యేటప్పటికి, తర్వాత సినిమాలకు కూడా శేషు కలం పట్టారు. ఎవరు స్పానిష్ ఫిలిం రీమేక్ అయినా , అడవి శేష్ రాయాలిసిందే . డైరెక్షన్ లో కూడా అడవి శేష్ జోక్యం చేసుకుంటారని చెబుతుంటారు.
ఇప్పుడు అడవి శేష్ ఫార్ములా యంగ్ హీరోలు ఫాలో అవుతున్నారు. సిద్ధు జొన్నలగడ్డ అనే యంగ్ హీరో ‘ కృష్ణ అండ్ హిస్ లీల ” అనే సినిమాతో ప్రేక్షకులకు చేరువ అయ్యారు. ఆరెంజ్ సినిమాలో హీరోయిన్ జెనీలియా వెనక పడే ముగ్గురు ప్రేమికుల్లో ఒకడిగా , సిద్దు నటించారు . ఆ తర్వాత ప్రవీణ్ సత్తారు డైరెక్ట్ చేసిన ” గుంటూరు టాకీస్ సినిమాతో ప్రేక్షకులకు తెలిసారు . కృష్ణ అండ్ .. ” సినిమాతో మంచి గుర్తింపు, విజయం సాధించారు . అయితే సిద్దు సినిమా చేయాలంటే ఒకటే కండిషన్ – డైరెక్టర్, రైటర్ తో పాటూ , తాను స్క్రిప్ట్ తయారు చెయ్యాలి . తనకి నచ్చినట్లు రాసుకుంటేనే , సినిమా స్టార్ట్ అవుతుంది . లేకపోతె లేదు .
ఇదే దారి లో నడుస్తున్న మరో యువ హీరో నవీన్ పోలిశెట్టి. నవీన్ తెలుగు లో నటించిన సినిమా ఒకటే ఏజెంట్ శ్రీనివాస ఆచార్య ఆత్రేయ ‘ . నవీన్ సినిమా ఒప్పుకోవాలంటే అదే కండిషన్ . తను కూడా స్క్రిప్ట్ రాయాలి. అవకాశం కోసం రాజీ పడే కొత్త దర్శక , నిర్మాతలు తప్ప ప్రముఖ దర్శక నిర్మాతలు ఇలాంటి యంగ్ హీరోలను అప్ప్రోచ్ కావడానికి ఇష్టపడటం లేదు. ఎందుకంటే ఏ ప్రాజెక్ట్ ప్రారంభం కావాలన్నా , హీరోకి కథ నచ్చాకే మొదలు అవుతుంది. అలాంటిది హీరోలే కథలు రాస్తామని డిమాండ్ చేయడం సహజం గానే సీనియర్ డైరెక్టర్స్ కి నచ్చడం లేదు. ఇలాంటి హీరోలు తమ పంధా మార్చుకోకపోతే, బిగ్ లీగ్ లోకి వెళ్లడం కష్టం కావచ్చు .











