‘వాడేవడైనా సరే పేదోడు కావొచ్చు..ధనవంతుడు కావొచ్చు. కొన్ని పనులున్నాయి. ఎవరికివారే చేసుకోవలసినవి. కాలకృత్యాలు, నిద్రాహారాలు, నీ ముడ్డి నువ్వే కడుక్కోవాలి. నీ నిద్ర నువ్యే పోవాలి.. నీ కోసం ఎవ్వడూ పడుకోడు. నీ తిండి నువ్వే తినాలి. నీ సెక్స్ నువ్వే చేయాలి. దానికోసం కూలీలను పెట్టలేంకదా.
ఇవి కాకుండా ఇంకో పని.. వర్క్. బతకడానికి నువ్వు చేసే పని. చాలా మంది తిట్టుకుంటూ ఆఫీస్‌కు వెళతారు. పనిచేయాలంటే బద్దకం. అలాంటప్పుడు ఆ పనిని మానేయండి. ఎందుకంటే మీకు ఆ పని ఇష్టం లేదు. సాట్టడే, సండే ఎప్పుడొస్తుందా అని ఎదురుచూస్తున్నావంటే యు ఆర్ ఇన్ ద రాంగ్ జాబ్.90 పర్సంట్ పీపుల్స్ రాంగ్ జాబ్ చేస్తుంటారు. కంపెనీ పెట్టుకున్న ప్రతీ ఓనరు మంచి ఎంప్లాయి దొరకడం లేదని ఎందుకు ఏడుస్తుంటాడో తెలుసా? ఎందుకంటే అక్కడ పనిచేసేవారంతా యాక్టర్స్. వాళ్లకు ఏవో ఇంట్రస్టులుంటాయి. కానీ డబ్బు కోసం జాబ్‌లో జాయిన్ అయి చక్కగా టై కట్టుకుని మనముందు చాలా సిన్సియర్‌గా ఉన్నట్లు లుక్స్ ఇస్తారు. అవి నమ్మి పని చేతిలో పెట్టేస్తే పనిని సంక నాకిస్తారు.
ఇంటి బాధ్యతలు, త్వరగా పెళ్లై పోవడం ఇలాంటి ప్రెజర్స్ వల్ల మనకు యాక్టర్స్ ఎక్కువై పోయారు. దయచేసి ఈ యాక్టింగ్‌లు మానేయండి. కష్టమైనా సరే ఇష్టమైన పనే చేయండి. మీ పని ఆటలా ఉండాలి. అలా ఉంటే ఖాళీ దొరికిందంటే ఆడుకోవడానికి వెళ్లిపోతావు. మన వర్క్‌ప్లేస్ ప్లే గ్రౌండ్ అయిపోద్ది. వర్క్ ఇస్ వర్‌షిప్. దేవుడి మీద ఉన్న ప్రేమను కూడా దీని మీద పెట్టేయండి. మన పనే మన మెడిటేషన్. ఏం చేసినా జాయ్ ఫుల్‌గా చేస్తే యు బికమ్స్ స్పిరుచ్వల్ ఇన్ క్రియేట్. నీ ఇష్టమైన పనేంటో తెలుసుకో. నీ ఇష్టమైన పనేంటో తెలుసుకో. తరువాత దానిని మతంలా మార్చేయ్. దాన్ని బిషప్ అయిపో.. లేదా చిన్న నిత్యానందలా తయారవు. ఒకటి.. పనే దైవం నీ ఆఫీసే దేవాలయం. రెండు.. నీకు ధర్మం కావాలంటే నువ్వు ఏ కంట్రీలో ఉంటే ఆ కంట్రీ లాను ఫాలో అయిపోతే సరిపోద్ది.. అదే ధర్మం. కాదు నేను భగవద్గీతలో చదివాను దష్ట రక్షణ సిష్ట రక్షణ అని. నేను వాన్ని సంహరిస్తాను అంటే పోలీసులు బొక్కలో వేస్తారు.
ఎందుకంటే ఎండ్ ఆఫ్ ద డే మనం ఫాలో అవ్వాల్సింది మన లా కోడ్.. లా.. రైట్. మూడు నీకు మనశ్శాంతి కావాలంటే మెడిటేషన్ చేసుకో. ఎవడు ఆపాడు నిన్ను. ఇలా చేస్తే నీకు ఏ రిలీజియన్ వద్దు. మతం అవసరంలేదు. నీ వర్క్ గాడ్ అయిపోవాలి. నువ్వు డీటీ మీద రిలీజియన్ అని చెప్పాలి. నువ్వు ఇలా ఉంటే అందరూ నీకు సెల్యూట్ చేస్తారు. నువ్వు బాగుంటే దేశం బాగుంటుంది. అన్నింటి కంటే కష్టం. కాలు మీద కాలు వేసుకొని ఖాళీగా కూర్చోవడం. ఈ విషయం లాక్‌డౌన్‌లో మనందరికీ క్లీయర్‌గా అర్ధమైంది. డబ్బు ఉన్నా లేకపోయినా ప్రతి రోజూ అందరూ పనిచేయాలి. డ్యూటీ చేస్తూ పోవాలి. జాబ్ మానేస్తానంటే ఓనర్ బతిమాలాలి తప్పా ఓకే సార్ దెన్ గో అనేలా ఉండకూడదు. ఫైనల్‌గా ఒక సీక్రెట్ చెప్తా. ఇష్టమైన పనిలో ఉంటే జీవితాంతం వర్క్ చేయనక్కర్లా.. ఎవ్రీ డే హాలిడే..’











