పాకీ( పంచ్ ) ప్రభాకర్ .. ఎక్కడా? మీకు ‘చేతకాకపోతే’చెప్పండి!
ఆంధ్రప్రదేశ్ లో అన్ని వ్యవస్థలతో పాటు ఉన్నత న్యాయస్థానం సైతం ఆత్మరక్షణలో పడింది. పాకీ(పంచ్)ప్రభాకర్ లాంటి నీచుడు, నికృష్టుడు వాడే పదజాలాన్ని మానవజాతి హర్షించదు. అధికార వైసీపీపై, పార్టీ అధినేత జగన్ రెడ్డి పై ఎవరైన విమర్శిస్తే చాలు .. ఆయన తన యూట్యూబ్ లో ప్రత్యక్ష్యమౌతాడు. ఆ తరువాత ఆయన ఎత్తుకునే బూతుల ఫ్లో, అచ్చ తెలుగు పరుష పదజాలం జీవితంలో ఎప్పుడు.. ఎక్కడ విని ఉండరు. ప్రజాస్వామ్యానికి అనుకూలంగా, జగన్ రెడ్డి అనాలోచిత నిర్ణయాలకు వ్యతిరేకంగా తీర్పు చెప్పే న్యాయమూర్తులను సైతం ఈ దుష్టుడు వదడంలేదు అంటే ఏపీలో ప్రేరేపిత ఉన్మాదం ఏ స్థాయికి చేరిందో చెప్పనక్కర్లేదు. రాజ్యాంగంలో స్వతంత్ర ప్రతిపత్తిని కలిగి ఉన్న న్యాయ వ్యవస్థలను, న్యాయమూర్తులను అవమానించడమేకాక దేశంలో అత్యున్నత పదవుల్లో కొనసాగుతున్న వారిని కూడా అమ్మనా బూతులు తిట్టే ఈ పాకీ ప్రభాకర్ ను పట్టుకురారా? అని హైకోర్టు ధర్మసనం సీబీఐ పై ఆగ్రహం వ్యక్తం చేసింది. పదిరోజుల్లో ఆ పాకీ( పంచ్ ) ప్రభాకర్ రెడ్డిని పట్టుకోలేకపోతే, సీట్ ఏర్పాటు చేసి మీ పని మేం చూయాల్సి వస్తోందని హెచ్చరించింది. సీబీఐ డైరెక్టర్ కూడా కోర్టుకు రావాల్సి ఉంటుందని ఏపీ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ కె. లలితతో కూడిన ధర్మాసనం సీబీఐని ఆదేశించింది. ఈ నెల 22 నాటి ఈ కేసును వాయిదా వేసింది.
వైసీపీ మద్దతుదారుడే పాకీ ప్రభాకర్!
దేశంలో రాజ్యాంగ కల్పించిన వాక్ స్వాతంత్ర్య హక్కుకు భంగంవాటిల్లేలా అధికారిపార్టీకి అనుకూలంగా ఏపిలో పంచ్ ప్రభాకర్ అనే దుర్మార్గుడు సృషించిన బూతుల సునామీ సభ్యసమాజం తలదించుకునేలా ఉంది. ఉన్మాద చర్యలకు ప్రోత్సహం, అండదండలు, భరోసా కల్పిస్తున్న అధికారపార్టీని, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి ప్రజలు క్షమించరు. జాతీయ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు న్యాయ, ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికాబడి ఉన్నత స్థాయి వ్యక్తులను ప్రభాకర్ రెడ్డి రెడ్డి నోటికొచ్చినట్లు తిడుతుంటే అధికారపార్టీకి చెందిన ఒక్కనాయకుడు కూడా బయటకు వచ్చి ఖండించలేకపోయారు. ఉపరాష్ట్రపతి, సుప్రీం చీఫ్ జస్టిస్, లోక్ సభ స్పీకర్, ఏపి హైకోర్టు న్యాయమూర్తులు వీరెవరో పాకిస్థాన్ వాసులు కాదు. భాతరదేశంలో రాజ్యాంగబద్ధంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ఎంపికాబడి దేశ భవితను, సమగ్రతను కాంక్షిస్తున్నవారేనని ముఖ్యమంత్రి, ఆపార్టీ ముఠా గుర్తించాలి.
కర్ణకఠోర పదజాలం .. తెలుగుకు పట్టిన చీడ!
గౌరవప్రదంగా పాకీ పనిచేసేవారుకూడా నోటిని అదుపులోపెట్టుకుని పదజాలాన్ని వాడతారు. నోటితో పాకీ పనిచేసేవారికే ఇటువంటి బూతుల దండకం వంటపడుతోందని సోషల్ మీడియాలో నెటిజన్లు మండిపడుతున్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ పై సోషల్ మీడియాలో అసభ్య పదజాలంతో దూషించడమేకాక, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ, ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లా వంటి రాజ్యాంగబద్ధ పదవీల్లో కొనసాగుతున్న వ్యక్తులను టార్గెట్ చేసి బండ బూతులు తిడుతూ తన వైఎస్ఆర్సీపీ అనుకూల యూట్యూబ్ చానెల్లో ఈ పైశాచిక ఫోస్ట్ లు పెడుతుంటాడు. నెల్లూరు జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడే ఈ పంచ్ ప్రభాకర్ అలియాస్ చీనేపల్లి ప్రభాకర్ రెడ్డి. వెటర్నరీ డాక్టర్ గా అమెరికాలోని న్యూజెర్సీలో నివాసం ఉంటున్నాడు ఈ దుష్టుడు అధికారపార్టీ సోషల్ మీడియా విభాగంలో కీలక సభ్యుడుగా వ్యవహరిస్తున్నాడని వార్తలుకూడా వినవస్తున్నాయి. అందుకే కాబోలు సభ్యతలేకుండా పార్టీలు, కులాలు, మతాలు, న్యాయాధిపతులు, పార్లమెంటేరియన్లు అని చూడకా.. అచ్చ తెలుగు బూతుల దండకాన్ని చదివి తన యూట్యూబ్ చానెల్లో పోస్టులు పెడుతుంటాడు.
ఉపరాష్ట్రపతినే చంపుతారా? హవ్వ..!
పాకీ ప్రభాకర్ నోటి దూల చివరికి ఉపరాష్ట్రపతిని, లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాను బాధించాయి. ఇరువురిని అనుచితంగా దూషించడంమేకాక, చంపుతా అనడంపై ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోర్డు అనుమతులతో ఐపీసీ 504, 506 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఏపి హైకోర్టు న్యాయమూర్తులపై కూడా నీచాతి నీచంగా బూతులు తిట్టడంతో కోర్టు నోటీసులు జారీ చేసింది. న్యాయమూర్తులపై తరుచు దూషణలకు పాల్పడుతున్న అధికార పార్టీకి చెందిన వ్యక్తుల్లో పంచ్ ప్రభాకర్ పేరు కీలంగా ఉంది. తక్షణమే అరెస్ట్ చేయకుంటే ఏం చేయాలో మాకు తెలుసని సీబీఐ పై హైకోర్టు ధర్మాసనం మండిపడింది. 10 రోజుల్లో ప్రభాకర్ రెడ్డిని పట్టుకుని న్యాయం స్ధానం ఎదుట హాజరుపర్చాలని సూచించింది.











