చేతిలో పత్రిక ఉందని .. ప్రత్యర్థి పార్టీ నేతలపై , వాళ్ళ ఆస్తులపై అడ్డుగోలుగా రాయడమే .. అలవాటుగా మార్చుకున్న సాక్షి పత్రికకి ఎదురుదెబ్బ తగిలింది .. తాము ఏమి రాసిన చెల్లుతుంది అనుకున్న .. సాక్షి ఆటలకి బ్రేక్ పడింది .. తమపై అసత్య వార్తలు రాస్తున్న సాక్షిపై పరువు నష్టం కేసు వేసిన గీతం యూనివర్శిటీ ఎట్టకేలకి విజయం సాధించింది . వైసీపీలో ఉంటె మంచి .. ప్రత్యర్థి పార్టీలో ఉంటె .. చెడు అన్నట్టుగా సాక్షి కధనాలు ఉంటాయి .. అవన్నీ ఎవరు నమ్మకపోయినా .. 100 సార్లు చెబితే అది నిజమవుతుంది అనేది సాక్షి సిద్దాంతం .. ఇప్పటికే ప్రజలకు ఈ కధ అర్ధం అయింది .. ఇప్పుడు కోర్ట్ కూడా సాక్షికి చెంప దెబ్బ వేసింది . విశాఖ గీతం యూనివర్శిటీ.. భూముల్ని ఆక్రమించుకుందంటూ సాక్షిలో గతంలో పలు కధనాలు రాశారు ..ఆయా కథనాలపై గీతం సంస్థ అప్పట్లోనే పరువు నష్టం దావా వేసింది. 2010 నుంచి ఈ దావా కొనసాగుతూ వచ్చింది .. అప్పట్లో గీతం యూనివర్సిటీ తమకు పరువు నష్టం కింద కోటి చెల్లించాలని ఆదేశించింది. ఆ దావాపై విచారణ జరిగిన కోర్టు తాజాగా .. సాక్షి తప్పుడు రాతలు రాసిందని తేల్చేసింది .. యూనివర్శిటీ పరువుప్రతిష్టలకు భంగం గలిగేలా సాక్షి చేసిందని నిర్ధారిస్తూ.. ఐదు లక్షల జరిమానా విధించింది. అంతేకాదు వీటిని వడ్డీతో సహా చెల్లించాలని ఆదేశిచింది. వాస్తవానికి పదమూడేళ్ల కిందట నుంచే గీతంపై సాక్షి పత్రికలో ఇష్టం వచ్చిటనట్లుగా కథనాలు రాసింది . ఆ కథనాలపై గీతం యాజమాన్యం వివరణ ఇచ్చినా…. వాటిని పట్టించుకున్న పాపాన పోలేదు .. వాటికి పేపర్ లో ప్లేస్ ఉండేది కాదు .. వాళళ్ ఇష్టం వచ్చినట్టు రాసుకుబేరు .. ఇప్పటికి . ఆ భూములను మార్కెట్ రేటుకు ఇవ్వాలని వైఎస్ హయాంలోనే యూనివర్సిటీ యాజమాన్యం దరఖాస్తు చేసుకుందుకి . అయితే.. తప్పుడు ప్రచారాలు చేయడానికే అన్నట్లుగా ఉండే సాక్షి మాత్రం ఇవన్నీ పట్టించుకోలేదు. ఇష్టం వచ్చిన రీతిలో రాసుకొచ్చింది . నాటి గీతం చైర్మన్ ఎంవీవీఎస్ మూర్తి ఇప్పుడు చనిపోయారు. ఆ తర్వాత కూడా కొన్ని కధానాలని వండి వార్చింది . ఇక ఇప్పుడు తాజాగా కోర్ట్ తీర్పు వచ్చింది. సాక్షికి జరిమానా విధిస్తూ తీర్పు వచ్చింది. అయితే .. తీర్పు ఇచ్చిన జడ్డి తర్వాత రోజే బదిలీ కావడం చర్చనీయాంశం అయింది. విశాఖలోనే మరో కోర్టుకు జడ్జిని బదిలీ చేశారు .. తమ ఆగడాలపై తీర్పు ఇవ్వడం కూడా తప్పే అన్నట్టు ఇప్పుడు ప్రభుత్వ వైవీ వ్యవహారం సాగుతుంది .. ఒక్క గీతం విషయంలోనే కాదు .. ప్రత్యర్థి పార్టీలో ఉండే పలువురు నేతలు , వారి వ్యాపారాలపై ఎన్నో విష కధనాలు సాక్షిలో వచ్చాయి .. వైసీపీ విపక్షంలో ఉన్నప్పటి నుంచి దాని రూటు అంతే . ఒకరకంగా లేని పోనీ అవాస్తవాలు అల్లే అధికారాన్ని అందుకున్నారు .. ఇప్పుడు అధికార పార్టీకి చెందిన పత్రికగా మారిన .. దాని బుద్ది మారడం లేదు .. విష కధనాలని రాస్తూనే ఉంది .ఎట్టకేలకి వారు తప్పుడు కధానాలకి మూల్యం చెల్లించుకుంది .. ఇకనైనా దాని రాతలు మకారతాయేమో చూడాలి.
కేసీఆర్ సారూ.. మైండ్ బ్లాక్ అయ్యిందా..?
కేసీఆర్ ధీమా చూస్తే.. ఎవరికైనా ఆశ్చర్యమేస్తోంది. ఆ తీసుకునే నిర్ణయాలు వింటే.. అందరికీ...