రామగిరి మండలంలో దారుణం చోటు చేసుకుంది. పెద్దపల్లిలో హైకోర్టు న్యాయవాదిని, ఆయన భార్యను దుండగులు నరికి చంపారు. మృతులు లాయర్ గట్టు వామన రావు, ఆయన సతీమణి నాగమణిగా పోలీసులు గుర్తించారు. గత కొంత కాలంగా పలు వివాదాల్లో వామన రావు జోక్యం ఉన్నందున.. ఆ వివాదాలకు సంబంధించిన వ్యక్తులు ఈ దారుణానికి పాల్పడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
మంథని నంచి హైదరాబాద్ వస్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసు కుంది. కారులో వచ్చిన ఇద్దరు దుండగులు వీరిని అటాక్ చేసినట్లు తెలుస్తుంది. ఈ ఘటనలో దంపతులిద్దరూ మరణించినట్లుగా పోలీసులు వెల్లడించారు. తమపై దాడిచేసింది కంటా శ్రీనివాస్ అని చనిపోయే ముందు స్టేట్ మెంట్ ఇచ్చిన వామనరావు.
Must Read ;- అత్యాచారం కట్టు కథేనా..?.. అసలు విషయం రాబట్టిన పోలీసులు











