ఏపీ సీఎస్‌గా ఆదిత్యనాథ్ దాస్ నియమించే అవకాశాలపై లియో న్యూస్ చెప్పిందే నిజమైంది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఆదిత్యనాథ్ దాస్‌ను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నెల 31న ఆదిత్యనాథ్ దాస్ సీఎస్‌గా పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఉన్న సీఎస్ నీలం సాహ్నీ పదవీ కాలం ఈ నెల 31తో ముగియనుంది. వెంటనే ఆదిత్యనాథ్ దాస్ పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఇప్పటికే ఆదిత్యానాథ్ దాస్ సీఎంఓలో కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అనేక కీలక శాఖల్లో ఆదిత్యనాథ్ దాస్ కార్యదర్శిగా పని చేశారు. జలవనరుల శాఖలో మంచి పట్టున్న ఆదిత్యనాథ్ దాస్‌ను కీలక పదవి వరించింది.
సీఎం ముఖ్య సలహాదారుగా నీలం సాహ్ని
ప్రస్తుతం ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న నీలం సాహ్నీని సీఎం ముఖ్య సలహాదారుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నీలం సాహ్నీ పదవీ కాలం రెండు సార్లు, మొత్తం 6 నెలలు పొడిగించారు. ఇక ఆమె పదవీ కాలం పొడగించే అవకాశాలు లేకపోవడంతో ఆదిత్యనాథ్ దాస్‌ను సీఎస్ పదవిలో నియమించినట్టు తెలుస్తోంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు సీబీఐ కేసుల్లో ఉన్న తెలంగాణ కేడర్‌కు చెందిన శ్రీలక్ష్మిని ఇటీవల ఏపీ క్యాడర్‌కు మార్చారు. వెంటనే శ్రీలక్ష్మిని మున్సిపల్ శాఖ కార్యదర్శిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు
Also Read: నిమ్మగడ్డతో పెట్టుకుంటే అంతే.. సర్కారుకు సరికొత్త బ్రేక్