పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ మళ్లీ కెమెరా ముందుకు వస్తుందండోయ్. ఈ విషయాన్ని ఆమె తన ఇన్ స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. ఆమె మొహానికి మేకప్ వేసుకుని అప్పుడే 18 ఏళ్లు అయిపోయింది. ఈ మధ్య రచయిత, కళాకారుడు గోరటి వెంకన్నను కలవడం మరో సారి వార్తల్లోకి ఎక్కడం జరిగింది. వ్యవసాయానికి సంబంధించి ఓ సినిమా చేయబోతున్నట్లు, అందులో గోరటి వెంకన్నతో ఓ పాట రాయించబోతున్నట్లు వార్తలొచ్చాయి. ఆ విషయాన్ని అలా ఉంచితే ఆమె తాజాగా ఓ వెబ్ సిరీస్ లో నటించేందుకు అంగీకారం చూపిందట. మంచి సబ్జెక్ట్ వస్తే సినిమాల్లో మళ్లీ నటిస్తానని ఆమె ఎప్పట్నుంచో చెబుతోంది.
”మళ్లీ కెమెరా ముందుకు రాబోతున్నా. ఓ చక్కటి వెబ్ సిరీస్‌లో నటించేందుకు సైన్ చేశానని చెప్పడానికి సంతోషంగానూ, అలాగే ఎగ్జయిట్ గా ఉన్నా. అక్టోబరులో షూటింగ్ ప్రారంభం కానున్న ఈ వెబ్ సిరీస్‌కు సంబంధించిన మరిన్ని వివరాలను కొద్ది రోజుల్లో తెలియజేస్తా. సత్యాన్వేషణలో ఉన్న ఓ మహిళకు మీ ఆశీర్వాదాలు కావాలి. ఈ వెబ్ సిరీస్‌కు నిర్మాతలు డి.ఎస్. రావు, ఎస్. రజినీకాంత్. సాయి కృష్ణ ప్రొడక్షన్స్ బ్యానర్‌లో రూపుదిద్దుకోనుంది. దీనికి దర్శకుడు ఎమ్.ఆర్. కృష్ణ మామిడాల. సినిమాటోగ్రఫీ దాశరథి శివేంద్ర..” అని రేణూ దేశాయ్ తన పోస్ట్‌లో పేర్కొన్నారు.
https://www.instagram.com/tv/CFW5Aori19M/?utm_source=ig_web_copy_link











