యంగ్ టైగర్ యన్టీఆర్ అన్న జానకీ రామ్, తండ్రి హరికృష్ణ .. ఒకే ప్రాంతంలో రెండు వేరు వేరు రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు విడిచిన సంగతి తెలిసిందే. పీడకలలాంటి ఆ సంఘటనలు జరిగినప్పటి నుంచి.. తన ప్రతీ సినిమాలోనూ.. ప్రారంభానికి ముందు .. ప్రయాణాల్లోని అప్రమత్తతపై ప్రేక్షకులకు తన విలువైన హెచ్చరిక లాంటి సూచనను అందిస్తూ వస్తున్నారు యన్టీఆర్. ఆయనకి నేడు కూడా అలాంటి ఓ సందర్భం వచ్చింది.
జాతీయ రహదారి భద్రతా మహోత్సవం సందర్భంగా.. నేడు సైబరాబాద్ లో నిర్వహించిన ప్రత్యేక కార్యక్రమంలో జూనియర్ యన్టీఆర్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి రైల్వేస్ అడిషనల్ డీజీ సందీప్ శాండిల్య, సి.పీ. సజ్జనార్, ట్రాఫిక్ డిసీపీ విజయ్ కుమార్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
ఈ కార్యక్రమంలో యన్టీఆర్ మాట్లాడుతూ.. నేను ఇక్కడికి ఒక నటుడిగా రాలేదు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు ప్రాణసమానుల్ని కోల్పోయిన బాధితుడిగా వచ్చాను. ఈ ప్రమాదం మా కుటుంబంలోని ఇద్దరు అతి ముఖ్యుల్ని పొట్టనపెట్టుకుంది. అందుకే మనం రొడ్డెక్కి వాహనం నడిపేటప్పుడు. మన కోసం ఎదురు చూసే. మన కుటుంబ సభ్యుల్ని ఒక్కసారి గుర్తు చేసుకోవాలని వాహన దారులకు సూచించారు. పోలీసులు ఉన్నది మనల్ని దండించడానికి మనల్ని సరైన దారిలో నడిపిండానికి. మనకు మనం బాధ్యతగా వ్యవహరించినప్పుడే మనం ప్రమాదాల్ని అరికట్ట గలుగుతామని అని యన్టీఆర్ వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమం అనంతరం జెండా ఊపి .. పెట్రోలింగ్ వాహనాల్ని ప్రారంభించారు.
Must Read ;- మహారాష్ట్రలో ఘోర రోడ్డు ప్రమాదం..