ప్రెస్ మీట్ పెట్టి మరీ ఎన్నకల కమిషన్‌పై ఇష్టం వచ్చిన రీతిన అవాకులు చెవాకులు పేలినందుకు నిమ్మగడ్డ చర్యలు తీసుకున్నారు. ఈ నెల 21 వరకు పెద్దిరెడ్డి ఇంటికే పరిమితమయ్యే చూడాలని నిమ్మగడ్డ, డీజీపీకి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఆదేశాలపై పెద్దిరెడ్డి కోర్టును ఆశ్రయించారు. ఎన్నికల కమిషన్, తనపై డీజీపీకి ఇచ్చిన ఆదేశాలను సస్పెంట్ చేయాలని కోరుతూ హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌పై వాదనలు విన్న కోర్టు తీర్పును మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేసింది. కాగా, రాష్ట్రపతి ఏపీలో పర్యటిస్తున్న కారణంగా, దానికి సంబంధించిన కార్యక్రమంలో పాల్గొనడానికి కోర్టు అనుమతినిచ్చింది. ప్రస్తుతం పెద్దిరెడ్డి, రాష్ట్రపతికి స్వాగతం పలికేందుకు రేణిగుంట ఎయిర్ పోర్టుకు బయలుదేరినట్లు సమాచారం.
విజయవాడకు సూపర్‌స్ట్రక్చర్ బ్రిడ్జ్…. బాబు చొరవతో కేంద్రం గ్రీన్ సిగ్నల్..!!
విజయవాడ నగరంలో 7 కిలో మీటర్ల సూపర్‌స్ట్రక్చర్ ఫ్లైఓవర్ రానుంది. రాష్ట్రంలో కూటమి...