ఏపీలో విగ్రహాల డాడులు ఆగడం లేదు. రామతీర్థంపై సిఎం ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన తర్వాతి రోజే.. అది నూతన సంవత్సరాన్ని ఆనందంగా స్వాగతించాల్సిన రోజున ఏకంగా మూడు విగ్రహాలను ధ్వంసం చేశారు దుండగులు. ఈ దాడులను హిందూ ధర్మకర్తలు, సామాన్యులు, రాజకీయ నాయకులు ఏక కంఠంతో ఖండిస్తున్నా.. ప్రభుత్వం మాత్రం ఉదాశీనంగా వ్యవహరించడాన్ని జనసేన పార్టీ అధ్యక్షులు తీవ్రంగా ఖండించారు. ఆంధ్రాలో ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే పాకిస్తాన్ గుర్తుకువస్తుందని కాస్త ఘాటుగా వ్యాఖ్యానించారు.
హిందూ దేవతా విగ్రహాల ధ్వంసం ప్రభుత్వ వైఫల్యమే – JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/oSXRjETE9Y
— JanaSena Party (@JanaSenaParty) January 1, 2021
విధ్వంసాలతో స్వాగతం
ఆంధ్ర ప్రదేశ్ లో నూతన సంవత్సారానికి దేవుని విగ్రహాల విధ్వంసాలతో స్వాగతం పలకడం దురదృష్టకరం. పాకిస్తాన్‌లో హిందూ దేవాలయాల విధ్వంసం చేస్తారని వన్నాం. ఇప్పుడు అలాంటి సంఘటనలను ఆంధ్ర ప్రదేశ్ కళ్లారా చూస్తున్నాం. ఆంధ్ర ప్రదేశ్‌లోని ప్రస్తుత పరిస్థితులు పాకిస్తాన్‌ను గుర్తుకు తెస్తున్నాయని ఒక అధికారక ప్రకటన విడుదల చేశారు పవన్ కళ్యాణ్. ఇలాంటి సంఘటనలు వరసగా జరగడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమని పవన్ పేర్కొన్నారు.