నూతన సంవత్సరానికి ఘనంగా స్వగతం పలికారు కరీనా కపూర్ ఖాన్, సైఫ్ అలీ ఖాన్. బాలీవుడ్ లోని అనేక మంది సినీ ప్రముఖులు మరో ప్రదేశానికి వెళ్లి న్యూ ఇయర్ పార్టీలు చేసుకున్నారు. కాని కరీనా కపూర్ , సైఫ్ అలీ ఖాన్ తమ కుటుంబ సభ్యులతో ఇంటిలోనే వేడుకులను జరుపుకున్నారు. త్వరలోనే మరో బిడ్డకు జన్మని ఇవ్వబోతున్న కరీనాకు ప్రత్యేకమైన విందును ఇచ్చి ఆశ్చర్యపరిచాడు భర్త సైఫ్. ఈ విందుకు సోహా అలీ ఖాన్, కునాల్ కెమ్ము, కృతిక కమ్రా, శిఖా తల్సానియా తదితరులు హాజరయ్యారు.
దీనికి సంబంధించిన కొన్ని ఫోటోలు, వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. ఆ ఫోటోలలో కరీనా, సైఫ్ ఒకరినొకరు పట్టుకొని కనిపించారు. కరీనా కొన్ని రంగులతో కూడిన పొడవాటి గౌన్ ధరించినట్లు ఫోటోలలో కనిపిస్తోంది. ఇక సైఫ్ అయితే లేత గులాబీ రంగు పైజమా వేసుకొని కనిపించారు. అలాగే వారి ఇల్లును కొవ్వొత్తులు, బెలూన్లతో అలంకరించారు. విందు కోసం డైనింగ్ టేబుల్ పై మంచి భోజనం, వైన్ పెట్టినట్లు ఫొటోలో కనిపిస్తోంది. కరీనా ప్లాన్ చేసిన మెనూ ఎంట్రీస్, మెయిన్ కోర్సు ,డెజర్ట్ వంటి వాటిని సోహా పంచుకున్నట్లు వీడియోలో కనపడుతోంది. ఫ్యాన్స్ కు, నెటిజన్లకు న్యూ ఇయర్ విషెస్ తెలిపారు కరీనా, సైఫ్.
ఈ వీడియో, ఫోటోలు చూసిన అభిమానులు కరీనా, సైఫ్ దంపతులకు కొత్త సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతున్నారు. వారికి త్వరలో పుట్టబోయే బిడ్డ ఆరోగ్యంగా పుట్టాలని వారు కోరుకుంటున్నారు. అంతేకాకుండా రానున్న కాలంలో కరీనా, సైఫ్ తమ సినిమాలతో మమ్మల్ని సంతోషపెట్టాలని కోరుతున్నారు.