పవన్ కల్యాణ్ నటిస్తున్న వకీల్ సాబ్ షూటింగ్ తిరిగి ప్రారంభమైంది. పవన్ కల్యాణ్ కూడా షూటింగ్ లో పాల్గొంటున్నారు. ఇదంతా ఓకేగానీ.. ఎంత షూటింగ్ కు అయితే మాత్రం.. పవన్ మెట్రోలో వెళ్లాల్సిన అవసరం ఏంటి? అని ఎవరికైనా అనిపిస్తుంది.
కొందరైతే పవన్ మెట్రో ప్రయాణం కూడా షూటింగ్ లో భాగమే అని.. ఆయన ప్రయాణిస్తున్న విజువల్స్ కూడా సినిమాలో కొన్ని సీన్లలో వాడుతున్నారని కూడా అనుకున్నారు. అలా జరగడానికి కూడా అవకాశం ఉంది గానీ.. అసలు సంగతి వేరు.
వకీల్ సాబ్ సినిమా షూటింగ్ ను గురువారం మియాపూర్ మెట్రో స్టేషన్లో ప్లాన్ చేశారు. ఉదయం మియాపూర్లో షూటింగ్ కు వెళ్లాలి. తన నివాసం నుంచి మియాపూర్ దాకా కారులో వెళ్లిపోవడం పవన్ అండ్ కో కు చాలా చిన్న సంగతి. కానీ పవన్ కల్యాణ్ కు ఎందుకో సరదాగా మెట్రో రైల్లోనే వెళ్దాం అనుకున్నారు. ఎటూ షూటింగ్ కూడా మెట్రో స్టేషన్లోనే గనుక.. డైరక్టుగా లొకేషన్ లో దిగవచ్చునని అనుకున్నారు.
అసలే మాధాపూర్ మెట్రో స్టేషన్ పవన్ కల్యాణ్ ఇంటికి కూతవేటు దూరంలో ఉంటుంది. అందుకే గురువారం పొద్దున్నే ఆరుగంటలకే బయల్దేరి స్టేషన్‌కు వచ్చారు. సరదాగా మెట్రోలో ప్రయాణించారు. ఆ సమయానికి అందులో ప్రయాణిస్తున్న ఇతర ప్రయాణికులతో ముచ్చట్లు పెట్టారు. ద్రాక్షారామం రైతుతో మాట్లాడి కష్టసుఖాలు విచారించారు. అలా షూటింగ్ లొకేషన్ కు చేరుకున్నారు. పవన్ కల్యాణ్ ఆ రైతుతో మాట్లాడుతూ.. మెట్రోలో ప్రయాణం తనకు ఇదే మొదటిసారి అని చెప్పారు. ఆ మొదటి మెట్రో ప్రయాణం ఆరకంగా కుదిరిందన్నమాట!