నాచురల్ స్టార్ నానితో కలిసి సుధీర్ బాబు నటించిన ‘వి’ సినిమా ఈనెల 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. ‘సమ్మోహనం’ తర్వాత ఇంద్రగంటి దర్శకత్వంలో సుధీర్ బాబు నటించిన చిత్రం ‘వి’.ఈ సందర్భంగా సుధీర్ బాబు తన అనుభవాలను వివరించారు. ఆయన ఏమంటున్నారో ఆయన మాటల్లోనే…
* ఓటీటీ వల్ల తొలి రోజునే వి సినిమాను ఎక్కువ మంది చూసే అవకాశం ఉంది. ప్రస్తుత పరిస్థితుల్లో ఓటీటీనే బెస్ట్ ఆప్షన్.
* లాక్డౌన్ సమయంలో రెండు రోజులకో కథ విన్నా. రెండు కథలను కూడా ఓకే చేశా. ఆ వివరాలను సదరు నిర్మాణ సంస్థలు ప్రకటిస్తేనే బావుంటుంది.
* ‘వి’లో నా పాత్ర చాలా పవర్ఫుల్. చాలా మందికి ఇన్స్పిరేషన్గా నిలిచే పాత్ర. ఇంద్రగంటిగారు కథ చెప్పగానే నాకు కూడా ఈ పోలీస్ ఆఫీసర్ పాత్ర బాగా నచ్చింది. చాలా మందికి ఇన్స్పిరేషన్గా ఉండే సదరు ఆఫీసర్‌ను ఓ కిల్లర్ ఛాలెంజ్ చేస్తాడు. అప్పుడు ఆ పోలీస్ ఆఫీసర్ ఏం చేస్తాడనేదే సినిమా. జస్టిఫికేషన్ ఉండే పాత్ర ఇది.
* యాక్షన్, డ్రామాకు వి లో మంచి స్పేస్ ఉంది. బ్రాడ్‌పిట్ యాక్ట్ చేసిన ఫైట్ క్లబ్ తరహాలో నా బాడీ ఫ్లెక్సిబుల్‌గా ఉండాలని ఇంద్రగంటిగారు చెప్పారు. దాంతో నేను బాడీని మరింత ఫ్లెక్సిబుల్‌గా చేసుకున్నా.
* నా ఇంట్రడక్షన్ ఫైట్ ను మాస్టర్ రవివర్మగా స్పెషల్‌గా డిజైన్ చేశారు.
* ట్రైలర్ చూసిన తర్వాత మహేశ్‌కు అందులో యాక్షన్ పార్ట్ బాగా నచ్చింది. తనకు ఇంద్రగంటిగారంటే మంచి ఒపీనియన్ ఉంది.
* వి సినిమా హీరో, విలన్ మధ్య కెమిస్ట్రీ బావుంటుంది. అదితిరావు హైదరి చక్కటి పెర్ఫామెన్స్ చేసింది. * ఈ సినిమాలో మంచి సంభాషణలతో పాటు మంచి యాక్షన్ పార్ట్ కూడా ఉంటుంది.
* నేను, నాని కంఫర్ట్ యాక్టర్స్, ఇద్దరం కొలతలు వేసుకుని నటించలేదు. ఆర్టిస్ట్‌గా నమ్మకం ఉండటంతో నానితో కలిసి చేయడానికి ఒప్పుకున్నా. ఇద్దరం మేమిద్దరం పోటీ పడటం అనడం కన్నా మా క్యారెక్టర్స్ పోటీపడతాయంటేనే బాగుంటుంది.
* ఇంద్రగంటిగారు .. డైరెక్టర్‌గా టెన్షన్ అంతా ఆయనే తీసుకుంటారు. సినిమా ముందు యూనిట్‌ను చాలా ప్రిపేర్ చేస్తారు..
* విలనిజం ఒక్కొక్క స్టైల్లో ఉంటుంది. సినిమాలో నాని నెగటివ్ షేడ్స్‌లో తన యాక్టింగ్‌తో ఓ డిఫరెంట్ లుక్ తీసుకొచ్చాడు.
* పుల్లెల గోపీచంద్‌గారి బయోపిక్ కొన్ని కారణాలతో వెనక్కి వెళుతోంది.. డిసెంబర్ లో స్టార్ట్ అవుతుందని భావిస్తున్నాను. ఇది నేను చేయబోయే పాన్ ఇండియా మూవీ.
* వెబ్ సిరీస్‌లు చేయడానికి అభ్యంతరం లేదు. మంచి ప్రొడక్షన్ హౌసెస్, బడ్జెట్ కుదిరితే చేయడానికి ఏమాత్రం ఆలోచించను. అలాగే నా ప్రొడక్షన్లోనూ వెబ్ సిరీస్‌లను చేయడానికి ప్లాన్ చేస్తున్నా.
* నిర్మాతగా కూడా జాయింట్ వెంచర్స్ చేయడానికి ప్లాన్ చేసుకుంటున్నా.
జగన్‌కి ప్రభాస్ ఫ్యామిలీ షాక్..?? తాడేపల్లి ప్యాలెస్‌కి మెస్సేజ్..!!
టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యామిలీ వైసీపీ అధినేత జగన్‌కి ఝలక్...