యంగ్ టైగర్ ఎన్టీఆర్ – మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో అరవింద సమేత వీర రాఘవ సినిమా రూపొందడం.. ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేయడం తెలిసిందే. వీరిద్దరూ ఇప్పుడు మరో సినిమా చేయనున్నారు. ఈ మూవీకి అయిననూ పోయిరావలే హస్తినకు అనే టైటిల్ పెట్టాలనుకుంటున్నారు. మరో విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ ఆర్ఆర్ఆర్ తర్వాత చేస్తున్న సినిమా కావడంతో దీనిని పాన్ ఇండియా మూవీగా ప్లాన్ చేస్తున్నారట.
ఈ క్రేజీ మూవీలో ముగ్గురు సీనియర్ హీరోలు నటించనున్నారని ఓ ఇంట్రస్టింగ్ న్యూస్ ప్రచారంలోకి వచ్చింది. ఇంతకీ ఆ ముగ్గురు సీనియర్ హీరోలు ఎవరంటారా.? బాలీవుడ్ సీనియర్ హీరో సంజయ్ దత్ కోసం త్రివిక్రమ్ ఓ కీలక పాత్రను రాసారట. ఇది రాజకీయ నాయకుడు పాత్ర అని సమాచారం. మరో హీరో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర. ఈయన కూడా రాజకీయ నాయకుడు పాత్ర పోషిస్తున్నారని తెలిసింది.
ఇక మూడో హీరో ఎవరంటే.. జయరామ్. ఈయన కూడా కీలక పాత్ర పోషించనున్నారని సమాచారం. అయితే.. ఏ పాత్రలో కనిపించనున్నారు అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. మరో విషయం ఏంటంటే.. ఇందులో ఎన్టీఆర్ సరసన ఇద్దరు కథానాయికలు నటించనున్నారని.. ఇద్దరిలో ఒకరుగా బాలీవుడ్ బ్యూటీ, అతిలోక సుందరి కుమార్తె జాన్వీ కపూర్ ను తీసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని టాక్ వినిపిస్తోంది. మార్చి నెలాఖరు నుంచి లేదా ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది.
Also Read: ముగ్గురూ ముగ్గురే.. ఆర్ఆర్ఆర్ అంటే వీరే