మెగాస్టార్ చిరంజీవి రీ ఎంట్రీ తర్వాత మరింత స్పీడు పెంచి వరుసగా సినిమాలు చేస్తున్నారు. ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత వేదాళం రీమేక్, లూసీఫర్ రీమేక్ చేయనున్నారు. ఆతర్వాత బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా చేయనున్నారు. ఇలా వరుసగా సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్న చిరంజీవి సామ్ జామ్ పొగ్రామ్ లో పాల్గొన్నారు. ఈ షోలో సమంతతో చిరంజీవి పలు ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా తన సినిమాల్లో ఏ సినిమాని ఏ హీరో రీమేక్ చేస్తే బాగుంటుంది చెప్పారు.
జగదేకవీరుడు అతిలోక సుందరి చిత్రానికి సీక్వెల్ చేయాలని అశ్వనీదత్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు కానీ.. సెట్ కావడం లేదు. చిరంజీవి జగదేకవీరుడు అతిలోక సుందరి సినిమా గురించి స్పందిస్తూ.. ఈ సినిమాని రామ్ చరణ్ లేదా మహేష్ బాబు చేస్తే బాగుంటుంది అని చెప్పారు. ఇక ఠాగూర్ మూవీని పవన్ కళ్యాణ్ చేస్తే బాగుంటుందన్నారు. ఇంద్ర సినిమాని ప్రభాస్ చేస్తే కరెక్ట్ గా సరిపోతుంది అని చెప్పారు. ఛాలెంజ్ మూవీని అల్లు అర్జున్ చేస్తే బాగుంటుంది. అలాగే విజయ్ దేవరకొండ చేసినా బాగానే ఉంటుందన్నారు.
ఇక గ్యాంగ్ లీడర్ చిత్రాన్ని ఎన్టీఆర్ లేదా రామ్ చరణ్ చేస్తే బాగుంటుంది. రౌడీ అల్లుడు అయితే.. రవితేజ లేదా అల్లు అర్జున్ చేయచ్చు అన్నారు. ఇక విజేత సినిమా నాగచైతన్యకు కరెక్ట్ గా సరిపోతుంది. అతను తప్పా ఇంకా ఎవరికీ సెట్ కాదు. నాగచైతన్య ఒక్కడినే విజేత సినిమా సెట్ అవుతుందని చెప్పారు. ఇలా.. తన సినిమాలను ఏ హీరో చేస్తే బాగుంటుందో చిరు చెప్పడం విశేషం.
Also Read: ఎన్టీఆర్, అల్లు అర్జున్ రాకపోవడానికి కారణం ఏంటో.?