గ్వాలన్ లోయలో ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో స్వదేశీ ఉద్యమం ఊపందుకొంది. ఇప్పటికే వీడియో స్ట్రీమింగ్ యాప్ టిక్ టాక్ తో సహా 59 యాప్ లను నిషేధిస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. తాజాగా మళ్లీ తలెత్తిన ఉద్రిక్తతల నేపథ్యంలో మన దేశంలో మోస్ట్ పాపులర్ గేమ్ ప్లేయర్స్ అన్నోన్ బాటిల్ గ్రౌండ్ (పబ్జీ)తో సహా 118 యాప్ లను కేంద్రం నిషేదించింది. ఈ మేరకు సమాచార మరియు సాంకేతిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. భారతదేశ సార్వభౌమాధికారం సమగ్రతకు ముప్పు కలిగించే 118 మొబైల్ అప్లికేషన్స్ ను నిషేధించామని ప్రభుత్వం తెలిపింది. డ్రాగన్ దేశ యాప్ లను వాడటం ద్వారా భారతదేశ రక్షణ, భద్రత మరియు ప్రజల వ్యక్తిగత సమాచార భద్రత ఉద్దేశంతో ఈ యాప్ లపై నిషేధం విధించారు.
పబ్జీ, పబ్జీ లైట్ గేమ్స్ కు యువతలో విపరీతమైన క్రేజీ ఉంది. ఫిబ్రవరి 2018లో ఈ గేమ్ ను అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ గేమ్ కు అడిక్ట్ అయినా యువత వార్తలు మనం చదివే ఉంటాం. ఈ గేమ్ ను ఇండియాలో 50 మిలియన్స్ మంది డౌన్లోడ్ చేసుకోవడం గమనార్హం. ఇప్పటికే ప్లే స్టోర్ లో పబ్జీ బెస్ట్ యాప్ గా నిలిచింది. దేశ భద్రత దృష్ట్యా కేంద్రం నిషేధం నిర్ణయం తీసుకుంది. పబ్జీతో బాటు కట్ కట్, కాంకార్డు, ఆప్స్ లాంచర్, ఆప్స్ సెక్యూరిటీ, ఆప్స్ టర్బో క్లీనర్, ఆప్స్ ఫ్లాష్ లైట్, ఫేస్ యూ, ఇన్ నోట్, సూపర్ క్లీన్, యు చాట్, స్మాల్ క్యూ బ్రెష్, సైబర్ హంటర్, లైఫ్ ఆఫ్టర్, స్మార్ట్ యాప్ లాక్ లాంటి యాప్స్ ను కేంద్రం నిషేదించింది.