కరోనా మహమ్మారి పీడ ఇక తొలగనుంది. త్వరలోనే కరోనా మన దేశంలో గాయబ్ కానుంది. దేశంలో కరోనా వైరస్ పీక్ దశ వెళ్లిపోయిందని కేంద్ర ప్రభుత్వం నియమించిన కమిటీ తెలిపింది. వచ్చే ఏడాది ఫ్రిబ్రవరి చివరి కల్లా కోవిడ్ వైరస్ పూర్తిగా అదుపులోకి వస్తుందని అందులో వెల్లడించింది. అయితే కొన్ని జాగ్రత్తలు మాత్రం అప్పటి వరకు పాటించాలని సూచించింది. ప్రస్తుతం రానున్నదంతా పండుగల సీజన్ కావడంతో కరోనా నిబంధనలు తప్పకుండా పాటించాలని సూచించింది.
కోటి ఐదు లక్షల కేసులు..
కరోనా వైరస్‌తో వణికిపోతున్న దేశ ప్రజలకు కమిటీ ఈ రకంగా శుభవార్తను తెలిపిందనుకోవచ్చు. మరో 4 నెలల్లో కరోనా అంతమవుతుందట. కోవిడ్ వ్యాప్తి అంశంపై కేంద్ర ప్రభుత్వం ఓ కమిటీని ఏర్పాటు చేసింది. కొత్తగా కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పడుతుండటం శుభసూచకమని తెలిపింది. కాకపోతే అప్రమత్తంగా ఉండాలని ప్రజలను కోరింది. దేశంలో ప్రస్తుతం అక్టోబర్ 18 నాటికి పాజిటివ్ కేసుల సంఖ్య 75 లక్షలు వరకు నమోదైంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికల్ల దేశంలో కోటి ఐదు లోల మంది కరోనా వైరస్ బారినపడతారని ఆ కమిటీ ఓ అంచనా వేసింది. అయితే ప్రజలు ఎక్కువగా గుమిగూడితే కేసుల సంఖ్య పెరిగే ప్రమాదం ఉందని హెచ్చరించింది. ఇందుకు కేరళలో ఆగస్టు 22 నుంచి సెప్టెంబర్ 2 వరకు ఓనం పండుగ ద్వారా పెరిగిన కేసుల ఘటనను ఉదాహరణగా పేర్కొన్నది.
కమిటీ తెలిపిన అంశాలు..
-కొద్ది రోజులుగా కేసుల క్రమం తగ్గుముఖం పట్టింది. నెలకు ప్రస్తుతం దేశంలో సరాసరిగా 26 లక్షల కొత్త కేసులు నమోదవుతున్నాయి.
– కరోనా వైరస్‌తో పోరాడగలిగే రోగనిరోధక శక్తి కలిగి ఉన్నవారు దేశంలో కేవలం 30 శాతం మంది మాత్రమే ఉన్నారు.
-నాలుగు నెలల్లో దేశంలో కరోనా పూర్తిగా తగ్గుముఖం.
-ప్రజలు కరోనా మార్గదర్శకాలను కచ్చితంగా పాటించాల్సిందే.
-2021 ప్రారంభంలో కరోనా మహమ్మారి వ్యాప్తి పూర్తిగా నియంత్రణలోకి వస్తుంది.
-అదుపులో వచ్చే నాటికి కోటి ఐదు లక్షల వరకు కేసుల సంఖ్య చేరుకుంటుంది.
-కరోనా బారినపడి మరణించినవారు ఇప్పటి వరకు 1.14 లక్షల మంది.
-కరోనా అదుపులోకి వస్తున్న క్రమంలో లాక్‌డౌన్ ఆంక్షలను తొలగించి అన్ని రకాల కార్యకలాపాలకు అనుమతి ఇవ్వవచ్చు.
-ప్రజలు పెద్ద సంఖ్యలో గుమిగూడితే ప్రమాదమని కమిటీ హెచ్చరించింది.
తెలంగాణ ప్రత్యేక కార్యాచరణ..
తెలంగాణ ప్రభుత్వం కరోనా వ్యాప్తి నివారణ విషయంలో ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. కారోనా దరిచేరకుండా ఎలాంటి జాగ్రత్తలు పాటించాలనే విషయంపై కొన్ని వీడియోలను ఆదివారం విడుదల చేసింది. వస్తున్నదంతా పండుగల సీజన్ కావడంతో మాస్కుమహారాజు తదితర పేర్లతో వినూత్నమైన అంశాలతో వీడియోలను రూపొందించి, తీసుకోవలసిన జాగ్రత్తలపై తెలంగాణ వైద్యారోగ్యశాఖ చర్యలు చేపట్టింది.
తెలంగాణలో తగ్గుతున్న కరోనా…
పండుగల సీజన్‌లో తెలంగాణ ప్రజలకు ఇది శుభవార్తే అని చెప్పాలి. వైద్యారోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్ బులిటెన్‌లో కరోనా కేసుల సంఖ్య వెయ్యిలోపే ఉంది. గత 24 గంటల్లో 948 పాజిటివ్ కొత్త కేసులు మాత్నరమేమోదయ్యాయి.1896 మంది రకవరీ అయ్యారు. నలుగురు మాత్రమే మృతి చెందారు. దీంతో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 2,23,059కు చేరుకుంది. 21,098 యాక్టివ్ కేసులు ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్నాయి. గత 24 గంటల్లో 26027 కరోనా టెస్టులు నిర్వహించారు.