18 మంది లిస్ట్‌లో అవంతి శ్రీనివాస్, గుడివాడ అమర్‌నాధ్‌తోపాటు మాజీ మంత్రి బాలినేని కూడా ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. వీరితోపాటు మరికొందరి పేర్లపై ఊహాగానాలు..
హిట్‌లిస్ట్ ఇపుడు ఈ పేరు వైసీపీ నాయకుల్లో వణుకు పుట్టిస్తోంది. ఈ హిట్‌లిస్ట్ ఎవరి మీద? అనే చర్చ సాగుతోంది. ‘గ్రాఫ్ పెంచుకోకపోతే నేనేమీ చేయలేను. పనితీరు బాగా లేని వారికి టిక్కెట్లు ఇవ్వను’ అని ముఖ్యమంత్రి జగన్ అనౌన్స్ చేసినప్పటినుండి ‘గడప గడపకూ’ కార్యక్రమం సమీక్షలో హెచ్చరించిన సంగతి తెలిసిందే. ఒక 18 మంది సరిగా పని చేయడం లేదని, వారి పేర్లను బయటపెట్టడం లేదని చెప్పి ‘సస్పెన్స్’ పెంచారు. ఫలితంగా ఆ 18 మంది ఎవరనే దానిపై ఊహాగానాలు వస్తున్నాయి. ‘గడప గడపకూ’ కార్యక్రమంలో పాల్గొనని ఎమ్మెల్యేలు, ఇన్‌ఛార్జ్‌ల పేర్లు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తున్నాయి. మంత్రుల్లో గుడివాడ అమర్‌నాథ్, పినిపె విశ్వరూప్, తానేటి వనిత, జోగి రమేష్, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు, రోజా పేర్లు గతంలో వినిపించాయి. మాజీ మంత్రులు బాలినేని శ్రీనివాస రెడ్డి, కొడాలి నాని, మేకతోటి సుచరిత, అనిల్ కుమార్ యాదవ్, ముత్తంశెట్టి అవంతి శ్రీనివాసరావు, పాముల పుష్ప శ్రీవాణి ‘గడపగడపకూ’లో పాల్గొనడం లేదని సీఎంకు నివేదికలు అందినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యేల్లో గ్రంధి శ్రీనివాసరావు, వసంత కృష్ణప్రసాద్, కోలగట్ల వీరభద్రస్వామి, ఆళ్ల రామకృష్ణారెడ్డి, రెడ్డి శాంతి ఉన్నారు. వైసీపీలో అంతర్గతంగా చర్చ జరుగుతోంది. జగన్ ఎవరిపై వేటు వేస్తాడు? నిజమేనా? సస్పెన్స్! అని తెగ భయపడిపోతున్నారు..
దాదాపు 65 మంది ఎమ్మెల్యేలు గడపగడపకూ లో పాల్గొనడం లేదని వైసిపి వర్గాలు చెబుతున్నాయి. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి ఆధారం అయితే… వారందరికీ టిక్కెట్లు ఇవ్వడం కష్టమే అంటున్నారు.. రాయలసీమ నుంచి సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి, ఉత్తరాంధ్రకు చెందిన మరో సీనియర్ మంత్రి బొత్స సత్యనారాయణ. ‘గడప’లో పాల్గొనడం లేదు. బుగ్గన, బొత్సలకు ముఖ్యమంత్రి మినహాయింపు ఇచ్చారని చెబుతున్నారు. గతంలో పెద్దిరెడ్డి పేరు అందరి ముందు చదివినా జగన్ ఆయనకు టిక్కెట్ నిరాకరించే సాహసం చేయలేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో స్పీకర్ తమ్మినేని సీతారాం కూడా పాల్గొనడం లేదని ఐపాక్ బృందం ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక ఇచ్చినట్లు సమాచారం. ఈ కార్యక్రమంలో కొడాలి నాని, తానేటి వనిత, కొట్టు సత్యనారాయణ, కారుమూరి నాగేశ్వరరావు కూడా సరిగా పాల్గొనడం లేదు. అయితే… సామాజిక వర్గ సమీకరణల నేపథ్యంలో వీరికి టిక్కెట్లు నిరాకరించలేమని తేలిపోయింది.