తాజాగా జరిగిన ఏపీ కేబినెట్ భేటీలో ముఖ్యమంత్రి జగన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన కేబినెట్ సహచరులలో కొందరు రహస్యాలను మీడియాకి లీక్ చేస్తున్నారని, ఇలా అయితే తాను ఎలాంటి సీక్రెట్‌లు పంచుకోనని వెల్లడించారు.. దీంతో, కేబినెట్ మంత్రులు ఒక్కసారిగా షాక్ అయ్యారు.. ముఖ్యమంత్రి జగన్ వ్యాఖ్యలు సంచలనంగా మారుతున్నాయి.. కేబినేటి భేటీ రహస్యాలను మీడియాకి, ఇతరులకు లీక్ చేస్తుందో ఎవరో అన్న చర్చ మొదలయింది.. ఒకరిద్దరు మంత్రులపై అనుమానాలున్నా.. ఆయన వారి పేర్లను వెల్లడించడానికి ఆసక్తి ప్రదర్శించలేదని పార్టీ వర్గాలలో గుసగుసలు వినిపిస్తున్నాయి.
జగన్ .. తన వ్యూహాలు, పథకాల గురించి అంతా సీక్రెట్‌గా ఉండాలని కోరుకుంటారు. ఏది జరిగినా, అంతా తన చుట్టూనే ఉండాలని, బయటకు లీక్ కాకూడదని ఆశిస్తాడు.. కానీ, తాను గత కొన్నాళ్లుగా కేబినేట్ భేటీలో పంచుకుంటున్న అనేక అంశాలు మీడియాకి, ప్రతిపక్షాలకు లీక్ కావడం జగన్‌కి నచ్చడం లేదని సమాచారం.. కొంతమంది మంత్రులకి ఏ అంశాలను పంచుకోవాలో, వేటిని గోప్యంగా ఉంచాలో తెలియడం లేదని, అందుకే, ఇకపై కేబినెట్ భేటీలో తాను ఆ విషయాలను బయట పెట్టకూడదని నిర్ణయించుకున్నాడని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు..
జగన్ పంచుకోవాలనుకునే అంశం ఏంటనేది ప్రస్తుతం రాజకీయ వర్గాలలో సంచలనంగా మారుతోంది.. ఇటు మంత్రులు సైతం కీలక రహస్యాలు మిస్ అయ్యామా?? అనే ఆలోచనలో ఉన్నారట.. టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిపై కేసులు, ఇతర అంశాలకు సంబంధించిన అంశాలు జగన్ పంచుకోవాలనుకున్నాడా.? లేక, ఏపీలోని తాజా రాజకీయ పరిస్థితులు, పార్టీ గ్రాఫ్‌పై ఆయన తన ఆలోచనలు పంచుకోవాలనుకున్నారా..?? అనేది అంతుపట్టడం లేదని లీకులు ఇస్తున్నారు మంత్రులు.
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యాన్ని షేర్ చేసుకోవాలనుకున్నాడా.? అది బూమరాంగ్ అయిన అంశాన్ని పంచుకోవాలనుకున్నాడా.? లేక, త్వరలో తీసుకోబోయే సంచలన నిర్ణయాలపై ఆయన ముందే తన మనసులో మాట చెప్పాలనుకున్నారా.. ?? అనేది కూడా తెలియక గందరగోళంలో పడిపోయారట.. ఇంతకీ జగన్ రహస్యాలను మీడియాకి, ప్రత్యర్ధులకు లీక్ చేస్తున్న మంత్రి, లేదా మంత్రులు ఎవరనేది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారుతోంది.