ఆంధ్ర ప్రదేశ్ లో జగన్ సర్కార్ కక్ష సాధింపు పాలన కొనసాగుతోంది. సుధీర్గ న్యాయ పోరాటం తర్వాత సుప్రీం కోర్టు ఆదేశాలను తప్పక అమలు చేయాల్సిన పరిస్థితుల్లో ఈనెల 14వ తేదీన సీనియర్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావును విధుల్లోకి తీసుకున్న వైసీపీ ప్రభుత్వం.. విధుల్లో చేరి రెండు వారాలు కూడా పూర్తికాకముందే మరోసారి ఆయన పై సస్పెన్షన్ వేటు విధించింది.1969 ఆల్ ఇండియా సర్వీస్ రూల్స్ కు విరుద్ధంగా వ్యవహరించారంటూ ఏబీవి ని సస్పెండ్ చేస్తూ ఏపీ సిఎస్ సమీర్ శర్మ ఉత్తర్వులు జారీ చేశారు.
గత తెలుగుదేశం ప్రభుత్వంలో నిఘా విభాగానికి అధిపతిగా ఉంటూ.. ఇజ్రాయిల్ నుంచి రక్షణ పరికరాలు కొనుగోలు చేసేందుకు ఎటువంటి ప్రభుత్వ అనుమతి లేకుండా తన వాళ్ళకి చెందిన ఆకాశ సిస్టమ్స్ కు 35 లక్షల రూపాయలు చెల్లించారనే అభియోగంతో జగన్ ప్రభుత్వం 2021 ఫిబ్రవరిలో ఆయనపై కేసు నమోదు చేయించిన వైసీపీ ప్రభుత్వం.. అవినీతి ఆరోపణలను చూపుతూ ఆయనను సస్పెండ్ చేసింది.నేరపూరిత కుట్ర, నమ్మక ద్రోహం, మోసం వంటి సెక్షన్ల కింద అభియోగాలు మోపి విచారణ కూడా చేపట్టింది.
ఈ క్రమంలో తనను అన్యాయంగా కేసుల్లో ఇరికించారంటూ ఏబీవీ ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టులో ఆయనకు ఊరట లభించడంతో జగన్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది. కాగా, సుప్రీంకోర్టులోనూ ఆయనకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. ఏబీ వాదనలు విన్న దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఏపీ హైకోర్టు తీర్పును అమలు చేయాలని 2022 ఏప్రిల్ 22న ఆదేశించింది.అయితే అప్పటికే ఆయన సస్పెన్షన్ రెండేళ్ళు దాటిపోవడంతో ఫిబ్రవరి నుంచే ఆయనను విధుల్లోకి తీసుకున్నట్లుగా ఆయనకు జీతబతయాలు చెల్లించాలని స్పష్టం చేసింది.ఇక సస్పెన్షన్ రెండేళ్ళు పై బడిన తర్వాత పోస్టింగ్ ఇవ్వకుండా ఏ అధికారిని ఉంచకూడదు అనేది సర్వీస్ రూల్. ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ తనకు పోస్టింగ్ ఇవ్వాలని ఏబీవీ ఏపీ సీస్ కు కోరారు. ఈ మేరకు మే 19న ఆయన జీఏడిలో రిపోర్ట్ చేశారు. చివరకు ప్రభుత్వం ఆయనకు జూన్ 14న పోస్టింగ్ ఇచ్చింది. తనపై ఉన్న ఏసీబీ కేసులో సాక్షులను వేంకటేశ్వర రావు ప్రభావితం చేసేలా వ్యవహరిస్తున్నారంటూ మరోసారి ప్రభుత్వం ఆయనపై సస్పెన్షన్ వేటు విధించింది. ఈ మేరకు ఉతరవులను జారీ చేసింది.
తనను మరోసారి సస్పెండ్ చేయడం పై సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు.సస్పెన్షన్ జీవో తన చేతికి ఇంకా రాలేదని.. తాను సామాజిక మాధ్యమాల్లోనే ఈ విషయాన్ని చూశానని చెప్పారు. తనపై ఏసీబీ కేసు ఉన్నమాట వాస్తవమేనని.. అయితే ఏడాదిన్నర క్రితం కేసు నమోదైనా ఇప్పటివరకు చార్జ్ షీట్ వేయలేదన్న ఆయన..అసలు ట్రయల్ మొదలవకుండా సాక్షులను ఎలా ప్రభావితం చేస్తానో చెప్పాలని ప్రశ్నించారు ? ఇటువంటి చచ్చు సలహాలు ఏ తీసేసిన తహశీల్దార్ లేక పనికిమాలిన సలహాదారో ఇచ్చి ఉంటారని ఎద్దేవా చేసహీన ఆయన.. ఒకసారి హైకోర్టు కొట్టేసిన సెక్షన్ కిందే మళ్ళీ ఎలా సస్పెండ్ చేస్తారని ప్రశ్నించారు.
అదేసమయంలో జగన్ పై 12 సిబిఐ కేసులు, 6 ఈడీ కేసులున్నాయని.. ఐఏఎస్ అధికారిని శ్రీలక్ష్మి పై చార్జ్ షీట్ లు ఉన్నాయని గుర్తుచేశారు. ఏసీబీ ఇచ్చిన నివేదికలో ప్రతీ వాక్యం తప్పన్న ఆయన.. వాటిని సాక్షాలతో సహాయ నిరూపిస్తానని అన్నారు. ఒక్క రూపాయి కూడా అవినీతి జరగని చోట అవినీతి కేసు ఎలా పెడతారని ఈ సందర్భంగా ఏబీవీ ప్రశ్నించారు.ఇప్పటికే ప్రభుత్వ పెద్దలు ఇజ్రాయిల్ వాళ్ళకి రెండు సార్లు లేఖ రాశారని.. అయితే వారు మాత్రం అవినీతి నిరోధక చట్టాలకు లోబడే పనిచేస్తామని చెప్పారని అన్నారు.
కొంతమంది వ్యక్తులు, కొన్ని శక్తులు తనను టార్గెట్ చేశాయన్న వెంకటేశ్వరరావు విశాఖ ఎయిర్ పోర్టులో జరిగిన కోడికత్తి ఘటనతో రాష్ట్రాన్ని తగులబెట్టాలనుకుంటే తాను గంటల్లోనే దానిని అడ్డుకున్నాని..అదేసమయంలో జరిగిన ఎన్నో వెధవ పనులను అడ్డుకున్నందుకే తనను టార్గెట్ చేశారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని పడగొడతానని తాను రాజ్ భావన గేటు ముందు కామెంట్ చేశాననడాన్ని ఆయన తప్పుబట్టారు. తాను ఎన్నడూ అటువంటి వ్యాఖ్యలు చేయలేదని స్పష్టం చేశారు.ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలపై న్యాయపోరాటం చేస్తానని ఆయన తెలిపారు. ప్రస్తుతం తాను సమాజానికి హాని కలిగించే పురుగులను తొలగించే వ్యవసాయం చేస్తున్నానని.. దుర్మార్గుడైన రాజు పాలనలో పని చేయడం కంటే అడవిలో వ్యవసాయం చేసుకోవడం మంచిదని ఒక కవి అన్నారని వెల్లడించారు.