పంటల బీమా ప్రీమియం సీఎం జగన్మోహన్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మేం పంటల బీమా ప్రీమియం చెల్లించామా? చెల్లించలేదా? అనేది ప్రతిపక్ష సభ్యులకేమి సంబంధం అంటూ సీఎం వింత వాదన వినిపించారు. డిసెంబరు 15తేదీ బటన్ నొక్కి రైతుల ఖాతాలకు పరిహారం ఇస్తామంటున్నాం…అయినా ప్రతిపక్షాల సభ్యులు కావాలనే గొడవ చేస్తున్నారు. మే పంటల బీమా ఎప్పుడు చెల్లిస్తే వారికేమి సంబంధం, కేంద్రంతో ఎప్పుడు అనుసంధానం చేసుకుంటే వారికేమి సంబంధం అంటూ సీఎం చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
జగనన్న స్కీమే ముద్దు
చంద్రబాబునాయుడు నిర్మించిన టిడ్కో ఇళ్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు రావడం లేదని సీఎం జగన్మోహన్ రెడ్డి సభలో ప్రకటించారు. అందరూ జగన్ స్కీమే ముద్దు అంటున్నారని ఆయన గుర్తుచేశారు. దీంతో టీడీపీ సభ్యులు నినాదాలు చేయడంతో.. వినకపోతే మార్షల్స్ ను పిలిచి ఎత్తి బయటపడేయండి అధ్యక్షా అంటూ సీఎం జగన్మోహన్ రెడ్డి స్పీకర్ ను కోరారు.
Also Read: టీడీపీలో రగులుతున్న కాపు ;కుంపటి;