వైసీపీ అధికారంలో ఉండగా… నాడు విపక్ష నేతగా ఉన్న ప్రస్తుత ఏపీ సీఎం నారా చంద్రబాబునాయుడిని అరెస్ట్ చేసే సమయంలో విదేశీ పర్యటనకు వెళ్లిన నాటి సీఎం జగన్… తనకు ఇందులో ప్రత్యేక ఇంటరెస్టేమీ లేదనే కలరింగ్ ఇచ్చారు. చంద్రబాబు అరెస్ట్ కు రంగం సాంతం సిద్ధం చేసిన తర్వాతే…ఆ నెపం తన మీదకు రాకుండా ఉండేలా జగన్ నాడు ఫారిన్ టూర్ ప్లాన్ చేసుకున్నారన్న వాదనలు నాడు వినిపించాయి. నాడు ఆయన అనుసరించిన వ్యూహమే ఇప్పుడు ఆయన రహస్యాలను బయటపెట్టేలా చేస్తోందన్న వాదనలు ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. జగన్ ఈ నెల 11న లండన్ పర్యటనకు వెళ్లనున్నారు. ఈ మేరకు సీబీఐ కోర్టు కూడా ఆయన టూర్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 30 దాకా ఆయన లండన్ లోనే ఉండనున్నారు. సరిగ్గా ఇదే సమయంలో జగన్ పీఏగా కొనసాగుతున్న కె. నాగేశ్వరరెడ్డి లియాస్ కేఎన్నార్ అరెస్ట్ చేసే దిశగా పోలీసులు అడుగులు వేస్తున్నారు. జగన్ అలా లండన్ ఫ్లైట్ ఎక్కగానే… ఇటు కేఎన్నార్ ను అరెస్ట్ చేయాలని వారు తలపోస్తున్నారట.
కేఎన్నార్ పై మొన్నటిదాకా పెద్దగా కేసులేమీ లేవనే చెప్పాలి. బెంగళూరులో నమోదైైన ఓ కేసులో కేఎన్నార్ పేరు ఉన్నా… అందులో ఆధారాలు పెద్దగా లభ్యం కాలేదు. అయితే తాజాగా జగన్, భారతిరెడ్డి బినామీలుగా ఎంట్రీ ఇచ్చిన చీమకుర్తి శ్రీకాంత్, రీతూ చౌదరిల వ్యవహారంలో కేఎన్నార్ పేరు గట్టిగానే వినిపిస్తోంది. వైసీపీ హయాంలో బెజవాడ శివారు ప్రాంతం ఇబ్రహీంపట్నం సబ్ రిజిస్ట్రార్ గా పనిచేసిన ధర్మ సింగ్… తనను వైసీపీ నేతలు బెదిరించి అత్యంత విలువైన సర్కారు భూములను తమ పేర్లపైకి రాయించుకున్నారని నేరుగా చంద్రబాబు, లోకేశ్ లకు లేఖ రాశారు.
ఈ వ్యవహారంలో శ్రీకాంత్, రీతూ చౌదరిలతో పాటుగా జగన్ పీఏ కేఎన్నార్ కూడా కీలకంగా వ్యవహరించారని ఆయన ఆరోపిస్తున్నారు. ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా కేసు అయితే నమోదు కాలేదు గానీ… త్వరలోనే కేసు నమోదు కావడం ఖాయమేనని చెప్పాలి. ఈ కేసులో కేఎన్నార్ ను కూడా నిందితుడిగా చేర్చడం కూడా ఖాయంగానే కనిపిస్తోంది.
సుదీర్గ కాలం పాటు జగన్ వద్ద పీఏగా పనిచేస్తున్న కేఎన్నార్ కు జగన్ లోగుట్టులన్నీ తెలిసే ఉంటాయన్న వాదన వినిపిస్తోంది. అదే సమయంలో జగన్ ఏ పని చేసినా అది కేఎన్నార్ కు తెలిసే జరుగుతుందని కూడా వైసీపీ వర్గాలే చెబుతున్నాయి. ఈ లెక్కన జగన్ చేసిన రాచకార్యాలన్నీ కేఎన్నార్ కు సంపూర్ణంగా తెలిసే ఉంటాయి. సర్కారీ భూముల అక్రమ రిజిస్ట్రేషన్ల కేసులో కేఎన్నార్ ను అరెస్ట్చ చేసి… పోలీసులు తమదైన శైలిలో విచారిస్తే… జగన్ ఘనకార్యాలన్నీ ఇట్టే కేఎన్నార్ నోట నుంచి బయటకు వచ్చేస్తాయన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఎలాగూ జగన్ 20 రోజుల దాకా లండన్ నుంచి తిరిగిరారు. ఈ సమయంలో కేఎన్నార్ ను ఎంతగా పిండితే… జగన్ ఘనకార్యాలు అన్నేసి బయటకు వస్తాయని తెలుస్తోంది. మరి ఈ దిశగా ఏం జరుగుతుందో చూడాలి.