హీరోయిన్లు గ్లామర్ తోనే ఎల్లకాలం నెట్టుకురాలేరు. గ్లామర్ కు మంచి నటన తోడైనప్పుడే సినీరంగంలో పదికాలాల పాటు తమ హవా కొనసాగించగలరు. కెరీర్ మొదట్లోనే దీనిని బాగా వంట పట్టించుకొన్న రష్మిక మందన్న తాను చేయబోయే పాత్రలో ఆ రెండూ ఉండేలా జాగ్రత్తలు పడుతోంది. తొలి చిత్రం `ఛలో‘, మలి చిత్రం `గీతా గోవిందం’లో అలాంటి పాత్రలే దొరకడంతో ఆమె కెరీర్ ఒక్కసారిగా మలుపు తిరిగింది. ఆ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన `సరిలేరు నీకెవ్వరు` చిత్రంలో నటించే అవకాశం ఆమెను వెతుక్కుంటూ వచ్చింది. ఆ సినిమా కూడా భారీ విజయాన్ని సాధించడంతో రష్మికకు స్టార్ హీరోయిన్ గా గుర్తింపు వచ్చేసింది.
ఓ వైపు తెలుగుతో పాటు తన మాతృభాషకు చెందిన కన్నడ సినిమాలు కూడా చేస్తోంది ఆ మధ్య కన్నడం కంటే తెలుగు చిత్రాలకే ఆమె ప్రాధాన్యం ఇస్తున్నట్లు శాండిల్ వుడ్లో విమర్శలు వెల్లువెత్తాయి. తనను హీరోయిన్ గా పరిచయం చేసిన కన్నడ సినీరంగాన్ని మరచిపోవడం సహేతుకం కాదన్నది ఆ విమర్శలలోని సారాంశం. అయితే తనకు అలాంటిదేమీ లేదని, ఎక్కడ మంచి పాత్రలు వస్తే అక్కడ చేసుకుంటూ పోతున్నానని ఆమె బదులిచ్చింది కూడా.
Must Read: అఖిల్ సరసన కన్నడ బ్యూటీ ఖాయమైందా?
ఏది ఏమైనా కన్నడ చిత్ర పరిశ్రమతో పోల్చుకుంటే తెలుగు చిత్ర పరిశ్రమ పెద్దది కావడంతో పాటు ఇక్కడ భారీ పారితోషికాలతో అవకాశాలు వస్తుండటమే టాలీవుడ్ కి ఆమె ప్రాధాన్యం ఇచ్చేందుకు కారణమైందన్న మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అల్లు అర్జున్ సరసన పుష్ప చిత్రంలోను, అలాగే శర్వానంద్ సరసన `ఆడవాళ్లు మీకు జోహార్లు` చిత్రంలోను ఆమె నటిస్తోంది. ఇంకా ధ్రువ సార్జా సరసన కన్నడ, తెలుగు భాషలలో రూపొందుతున్న `పొగరు’ చిత్రంలోను, తమిళంలో కార్తి సరసన `సుల్తాన్’ చిత్రంలోను ఆమె నటిస్తోంది. దీనిని తెలుగులోకి అనువదిస్తున్నారు. తమిళ సినీరంగంలోకి ఆమె అడుగుపెట్టడం ఇదే తొలిసారి. ఈ చిత్రం తర్వాత తమిళంలో ఆమె కెరీర్ ఎలాంటి మలుపు తీసుకుంటుందో తేలిపోనుంది అంటున్నారు.
ఇక అంత్యంత ముఖ్యమైన విషయం ఏంటంటే..పుష్ప చిత్రంలోని పాత్ర కోసం చిత్తూరు యాస నేర్చుకుని మరీ ఆ డైలాగులను అద్భుతంగా చెప్పేస్తోందట. సాధారణంగా పర బాషల హీరోయిన్లు తెలుగు సినిమాలు చేసేటప్పుడు వారికి డబ్బింగ్ వేరే కళాకారులు చెబుతుంటారు. కానీ కొందరు పరభాషల హీరోయిన్లు తమ డబ్బింగ్ తామే చెప్పుకునేందుకు మక్కువ చూపుతారు. అలాంటి హీరోయిన్లలో సాయిపల్లవి ఒకరు. తన తొలి చిత్రం ‘ఫిదా’ లో ఆమె తెలంగాణ యాసను అద్భుతంగా పలికి ప్రేక్షకుల మన్ననలు పొందింది. ఆలా సాయిపల్లవి కోవలోనే రష్మిక ప్రత్యేకంగా చిత్తూరు యాసను ఏంతో శ్రద్దగా నేర్చుకుని ఎంచక్కా డైలాగులు చెప్పేస్తూ చిత్ర బృందాన్ని ఆచ్చర్యపరుస్తోందట.
Also Read: అల్లు అర్జున్ మరో రికార్డు











