సస్పెండైన జడ్జి రామకృష్ణకు ఎట్టకేలకు హైకోర్టు బెయిల్ మంజూరు చేసింది. రాజద్రోహం కేసులో అరెస్టై రెండు నెలలుగా జైల్లో ఉన్న జడ్జి రామకృష్ణకు బెయిల్ లభించింది. సస్పెండైన జడ్జి రామకృష్ణ తరఫున మాజీ ఏజీ దమ్మాలపాటి శ్రీనివాస్ వాదనలు వినిపించారు.ఇద్దరు వ్యక్తుల పూచీకత్తు సమర్పించాలని ధర్మాసనం ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి మీడియాతో మాట్లాడవద్దని సప్పెండైన జడ్జి రామకృష్ణను హైకోర్టు ఆదేశించింది.
తిరుపతిలో చికిత్స పొందుతున్న రామకృష్ణ
గవర్నర్ ఆదేశాల మేరకు సస్పెండైన జడ్జి రామకృష్ణకు తిరుపతిలో వైద్యం అందిస్తున్నారు. ఏప్రిల్ 17న రాజద్రోహం కేసులో అరెస్టైన రామకృష్ణను ముందు చిత్తూరు జైలులో ఉంచారు. తోటి ఖైదీల నుంచి ప్రాణహాని ఉందని ఆయన తనయుడు హైకోర్టుకు, జైళ్ల శాఖ ఉన్నతాధికారులకు లేఖలు రాయడం అప్పట్లో సంచలనంగా మారింది. తరవాత రామకృష్ణను పీలేరు జైలుకు తరలించారు. సస్పెండైన జడ్జి రామకృష్ణకు వైద్య సేవలు అందించేలా ఆదేశించాలని ఆయన కుమారుడు గవర్నర్‌కు లేఖ రాశారు. ఆయన వెంటనే స్పందించి రామకృష్ణను తిరుపతి తరలించి వైద్యం అందించాలని ఆదేశించారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో వైద్యం పొందుతున్నారు. హైకోర్టు బెయిల్ మంజూరు చేయడంతో, నిబంధనలు పూర్తి అయిన తరవాత రేపు విడుదల చేసే అవకాశం ఉందని న్యాయవాదులు తెలిపారు.
Must Read ;- మాన్సాస్ ట్రస్టు ఛైర్ పర్సన్‌గా సంచయిత నియామకం చెల్లదు : హైకోర్టు











