మాజీ మంత్రి ఈటల రాజేందర్ బీజేపీలో చేరే విషయం దాదాపు ఖరారు కావడంతో విజయశాంతి ఆయనను అభినందిస్తూ ట్వీట్ చేశారు.ఈటల ఢిల్లీలోని బీజేపీ పెద్దలతో భేటి అయిన విషయం తెలిసిందే.ఈ సందర్భంగా బీజేపీ నాయకురాలు విజయశాంతి‘తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన నిర్ణయం తీసుకున్నారు.పార్టీలో చేరుతున్నందుకు అభినందనలు’అంటూ ట్వీట్ చేశారు.తెలంగాణలో టీఆర్ఎస్‌ను ఎదరించి నిలిచి గెలిచే సత్తా,సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయని ఆమె అన్నారు.
Must Read ;- ఈటల ధిల్లీ టూర్.. బీజేపీలో చేరిక ఖరారేనా
తమ్ముడు ఈటల రాజేందర్ బీజేపీ వైపు సరైన నిర్ణయం దిశగా వెళుతున్నందుకు అభినందనలు. టీఆరెస్‌ను ఎదిరించి నిలిచి, గెలిచే సత్తా, సామర్థ్యం బీజేపీకి మాత్రమే ఉన్నాయనేది ఇయ్యాల తిరుగులేని వాస్తవం.
— VIJAYASHANTHI (@vijayashanthi_m) June 1, 2021











