రెబల్ స్టార్ ప్రభాస్, కన్నడ బ్యూటీ పూజా హెగ్డే జంటగా నటిస్తోన్న రొమాంటిక్ లవ్ స్టోరీ రాధేశ్యామ్. పాన్ ఇండియా లెవెల్లో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో సైతం విడుదలవుతోన్న ఈ సినిమా కి సంబంధించిన తాజా లుక్ ను పూజా హెగ్డే పుట్టిన రోజు సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. అలాగే.. ప్రభాస్ పుట్టినరోజును పురస్కరించుకొని.. ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ పేరుతో ఈ నెల 23న ఒక బ్యూటి ఫుల్ టీజర్ తో అభిమానుల్ని ఖుషీ చేయబోతున్నారు మేకర్స్. జిల్ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాకు సంబంధించిన మరో అప్డేట్ ఈ రోజు వచ్చింది.
అదేంటంటే..‘ రాధేశ్యామ్’ సినిమాకి సంగీత దర్శకుడిగా తమిళ యువ సంగీత దర్శకుడు జెస్టిన్ ప్రభాకర్ ను ఎంపిక చేసినట్టు తెలుస్తోంది. తమిళం, మలయాళ సినిమాలకు సంగీతం అందించిన ఈ కుర్రోడు.. విజయ్ దేవరకొండ ‘డియర్ కామ్రేడ్’ సినిమాకి కూడా సంగీతం అందించాడు. ఇంతవరకూ కేవలం చిన్న సినిమాలకే సంగీతం అందించిన ఇతడు ఇప్పుడు రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాకి బాణీలు అందించనుండడం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఈ సినిమాతో అతడి జాతకమే మారిపోతుందని చెప్పుకుంటున్నారు. ఇక త్వరలో రాబోతున్న ‘బీట్స్ ఆఫ్ రాధేశ్యామ్’ టీజర్ కు, ఈ సినిమా కు జెస్టిన్ సంగీతం ఏ మేరకు హైలైట్ అవుతుందో చూడాలి.











