దేశంలోని ఏ రాష్ట్రంలోనూ ఇసుకపై ఇంత దుమారం చెలరేగలేదు. ఇసుక దొరక్క భవన నిర్మాణ పనులు ఆగిపోవడంతో చాలామంది కార్మికులు ఆత్మహత్యలు చేసుకునే స్థాయికి చేరుకుంది సమస్య. వాటిపై ప్రతిపక్షాలంతా ఒక్కటై ప్రభుత్వాన్ని ప్రశ్నించినా స్పందన రాలేదు. ఈ విషయమై జగన్ సర్కార్ అప్రతిష్ఠ మూటకట్టుకుంది. ఇప్పుడు ఇదే విషయాన్ని సోషల్ మీడియా ద్వారా నారా లోకేష్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.
భవన నిర్మాణ కార్మికుల ఆత్మహత్యలు అన్నీ ప్రభుత్వ హత్యలే. ఇసుక అక్రమ రవాణా ఆపాలి. భవన నిర్మాణ కార్మికులను ఆదుకోవాలి అంటూ అసెంబ్లీ సమావేశాల సందర్భంగా డిమాండ్ చేస్తూ నిరసన తెలిపాం.(2/2) pic.twitter.com/T8cvyePw3T
— Lokesh Nara (@naralokesh) December 2, 2020
ఇసుకాసురులు
జగన్ సర్కార్ ఇసుకాసురులు ప్రజలని దోచుకుంటున్నారని దుయ్యబట్టారు. చంద్రబాబు ప్రభుత్వ హయాంలో 5 యూనిట్ల ఇసుక 5 వేలుకు అందుబాటులో ఉండేదని, కానీ ఇప్పుడు ఆ ధరకు ట్రాక్టర్ ఇసుక కూడా రావట్లేదని, ఇదా మీ ప్రభుత్వం ప్రజలకు చేస్తున్న మేలు అంటూ ప్రభుత్వాన్ని నిలదీశారు. లారీ ఇసుకు కొనాలంటే దాదాపు 30 వేలు అవుతుందని, ప్రజల రక్తాన్ని జలగల్లా పీల్చేస్తున్నారని చెప్పుకొచ్చారు. ఇసుక అక్రమ రవాణా చేస్తూ దళారులు సంపాదించుకుంటున్నారు. ఇసుక కృత్రిమ కొరత సృష్టిస్తూ, ధరలు పెంచేస్తున్నారని, వీటిని అరికట్టాల్సిన బాధ్యత ప్రభుత్వానికి ఉన్నా చోద్యం చూస్తుందన్నారు. ఇసుకు దొరక్కా చాలా మంది భవన నిర్మాణ కార్మికులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని, వారివి ప్రభుత్వ హత్యలంటూ నిలదీశారు.
ఇష్టారాజ్యం
జగన్ ప్రభుత్వం వచ్చింది మొదలు పాత ప్రభుత్వ విధానాల్లో అవినీతికి పాల్పడ్డారని ఆరోపిస్తూ, గత ప్రభుత్వ విధానాలను రద్దుచేసింది. వాటిలో ఇసుక విధానం కూడా ఉండడంతో ఇసుక దొరక్క భవన నిర్మాణాలు ఎక్కడివక్కడ ఆగిపోయాయి. దీంతో ప్రజలు ఆగ్రహానికి, ప్రతిపక్షాల ఆందోళనలకు తలొగ్గిన ప్రభుత్వం కొత్త ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టింది. దీంతో ఇసుక ధరలు కొండెక్కి కూర్చున్నాయి. ట్రాక్టర్ ఇసుక కొనాలంటే జేబు కాలి అవ్వాల్సిందే. దీని వల్ల ఇసుక అందుబాటులోకి వచ్చినా భవన నిర్మాణాలు తిరిగి ప్రారంభించే పరిస్థితి లేకుండా పోయింది. ఇసుక రేట్లు పెరగడంతో భవన నిర్మాణాల ధర అమాంతం పెరిగిపోయింది.
అంతా ఒక్కరికే ఇచ్చేయండి
ప్రభుత్వ ఇసుక విధానం విఫలం కావడంతో సరికొత్త విధానానికి శ్రీకారం చుడుతున్నట్లు ప్రకటించింది జగన్ ప్రభుత్వం. అంతా ఒకే సంస్థకు కట్టబెట్టడానికి సిద్ధమైంది. దీని ద్వారా ఆ సంస్థ ప్రభుత్వానికి జవాబుదారిగా ఉంటుంది. కానీ, సాధారణంగా పార్టీకి సంబంధించిన వారికి కట్టబెట్టడం ఖాయం. మళ్లీ అదే సమస్య రిపీట్ అవక తప్పదు. ధరలు అదుపుకావడం అనేది జరగడం కష్టం. అధికారాలు మొత్తం ఒకే సంస్థ చేతికి వస్తే ఇసుక కొరతను కృతిమంగా సృష్టించి ధరలు ఆకాశాన్నంటేలా చేయడం పెద్ద విషయం కాదు. మేము ప్రతి పని పారదర్శకంగా చేస్తున్నాం అని డప్పు కుంటున్న ప్రభుత్వం ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.
Must Read ;- పంటల బీమాపై దిగొచ్చిన ప్రభుత్వం.. టీడీపీ వ్యూహంతో వైసీపీ కలవరం











