గత కొంత కాలంగా బాలీవుడ్ భామ కియారా అద్వాని, బాలీవుడ్లో హీరోగా వెలుగొందుతున్న సిద్దార్థ్ మల్హోత్రాతో డేటింగ్ లో ఉన్నట్లు వార్తలు మిన్నంటుతున్నాయి. అయితే వాటిని పట్టించుకోకుండా, సమాధానం ఇవ్వకుండానే వారిద్దరూ కలసి తరచూ బయటి ప్రదేశాలలో కనిపిస్తుండటంతో ఈ వార్తలు మరింత జోరు అందుకున్నాయి. సిద్దార్థ్ మల్హోత్రా తొలుత అసిస్టెంట్ డైరెక్టర్ గా కెరీర్ ఆరంభించి ఆ తర్వాత హీరోగా పరిచమయ్యారు. ఇప్పటికే పలు చిత్రాలలో నటించి హీరోగా మంచి పేరు సంపాదించుకున్నారు. అలాగే కియారా కూడా బాలీవుడ్లో సినిమాలు చేస్తూనే తెలుగు సినిమాలలో కూడా నటించింది. మహేష్ బాబు సరసన “భరత్ అనే నేను”, రామ్ చరణ్ సరసన “వినయ విధేయ రామ” చిత్రాలలో నటించింది.

ప్రస్తుతం బాలీవుడ్ చిత్రాలతో బిజీగా ఉంటూనే కియారా తరచూ సిద్దార్థ్ మల్హోత్రా చిట్టాపట్టాలేసుకుని తిరుగుతూ కనిపిస్తుండటమే వదంతులకు కారణమైంది. వీటికి మరింత బలాన్ని చేకూరుస్తూ వీరిద్దరూ ముంబై ఎయిర్ పోర్టులో మాస్క్ లతో గుర్తు పట్టలేకుండా కనిపించినప్పటికీ కెమెరాలు క్లిక్ మన్నాయి. కొత్త ఏడాది వేడుకలను ఆనందంగా జరుపుకునేందుకు వీరిద్దరూ మాల్దీవులకు వెళ్లారు. అక్కడికి చేరుకున్న తర్వాత బీచ్ లో తాను షికారు చేస్తున్న ఫోటోలను కియారా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది కూడా. మొత్తం మీద వీరి మధ్య ఎఫైర్ నడుస్తోంది అనేందుకు ఇంతకంటే ప్రూఫ్ ఇంకేమి కావాలన్న మాటలు ఎక్కడపట్టినా వినిపిస్తున్నాయి.











