టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గత 50 రోజులుగా అక్రమ అరెస్ట్‌తో జైలులో ఉన్నారు.. ఆయన తప్పు చేసినట్లు ఇంతవరకు ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయింది ఏపీ సీఐడీ.. మరోవైపు, వ్యవస్థలను మేనేజ్ చేస్తూ చంద్రబాబుని జైలులో ఉంచుతున్నారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి జగన్.. రాజకీయంగా చంద్రబాబుని ఎదుర్కోలేకే చంద్రబాబుపై తప్పుడు కేసులు బనాయిస్తున్నారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు..
మరోవైపు, చంద్రబాబు అరెస్ట్ మరో తెలుగు రాష్ట్రం అయిన తెలంగాణలోనూ రాజకీయ ప్రకంపనలు రేపుతోంది.. ఆయన అరెస్ట్‌పై పలు పార్టీల నేతలు భిన్నంగా స్పందిస్తున్నారు.. ముఖ్యంగా అధికార బీఆర్‌ఎస్.. చంద్రబాబు అరెస్ట్‌ని కొంతమంది బీఆర్‌ఎస్ నేతలు తప్పు పడుతుండగా, మరికొందరు నేతలు సైలెంట్‌గా ఉంటున్నారు. బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌కి, ఏపీ ముఖ్యమంత్రి జగన్‌కి మంచి అనుబంధం ఉంది.. గత ఏపీ ఎన్నికలలో జగన్‌కి కేసీఆర్ పరోక్షంగా సాయం చేశారనే ప్రచారం ఉంది.. తాజాగా చంద్రబాబు అరెస్ట్‌తోనూ కేసీఆర్ హస్తం ఉందని రాజకీయ పరిశీలకులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు..
ఈ ఊహాగానాలే బీఆర్‌ఎస్‌కి శాపంగా మారుతున్నాయనే చర్చ నడుస్తోంది.. తెలంగాణలోని టీడీపీ కార్యకర్తలు, చంద్రబాబు అభిమానులు బీఆర్‌ఎస్‌కి ఝలక్ ఇచ్చి కాంగ్రెస్‌కి ఓటు వేయాలని నిర్ణయం తీసుకోవడానికి రెడీ అయ్యారనే వాదన వినిపిస్తోంది.. చంద్రబాబు అరెస్ట్‌కి వ్యతిరేకంగా హైదరాబాద్‌లో కొందరు ఐటీ ఉద్యోగులు ధర్నాలు, నిరసనలకు రెడీ అయ్యారు.. వాటిపై మంత్రి కేటీఆర్ ఉక్కుపాదం వేశారు.. వాటిని ఏపీలో చేసుకోవాలని, హైదరాబాద్‌లో అయితే శాంతి భద్రతలకు విఘాతం జరుగుతోందని వివరించారు.. కేటీఆర్ వివరణతో తెలంగాణలో సీమాంధ్ర ఓటర్లు బీఆర్‌ఎస్‌కి వ్యతిరేకంగా ఓటు వేయాలని దాదాపు ఓ నిర్ణయానికి వచ్చినట్లు ఆ పార్టీ నిఘా వర్గాలలో తేలింది.. దీంతో, హరీష్ రావు.. టీడీపీ కార్యకర్తలను అనునయించడానికి, బాబు అరెస్ట్ అన్యాయం అంటూ కామెంట్ చేశారు..
తాజాగా కేసీఆర్ కూతురు కవిత కూడా చంద్రబాబు అరెస్ట్‌పై స్పందించారు.. ఈ వయసులో ఆయన అరెస్ట్ దురదృష్టకరమని అన్నారు కవిత. బాబు అరెస్ట్‌తో ఆయన కుటుంబం బాధను అర్ధం చేసుకోగలనని, వారికి తన సానుభూతి తెలిపారు.. తమకు ఏ పార్టీతో జట్టు లేదని, కేసీఆర్ తెలంగాణలో హ్యాట్రిక్ సాధించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు. ఇటీవల, కేటీఆర్ కూడా సీమాంధ్ర ఓటర్లలో వ్యక్తం అవుతున్న, గూడు కట్టుకున్న ఆవేదనని అర్ధం చేసుకొని బాబు అరెస్ట్‌పై మాట మార్చారు.. చంద్రబాబు అరెస్ట్‌తో నారా లోకేష్ బాధను తాను అర్ధం చేసుకోగలనని సానుభూతి తెలిపారు..
ఇలా వారం రోజుల గ్యాప్‌లోనే బీఆర్‌ఎస్ కీలక నేతలు వ్యాఖ్యానించడం తెలంగాణ రాజకీయాలలో చర్చనీయాంశంగా మారుతోంది. మరోవైపు, చంద్రబాబు అరెస్ట్‌తో వ్యక్తం అవుతోన్న సానుభూతి ఓట్లు కాంగ్రెస్‌కి బదిలీ అవుతాయని ఆ పార్టీలో విస్తృత చర్చ నడుస్తోంది.. అదే బీఆర్‌ఎస్ పుట్టి ముంచడం ఖాయం అని భావిస్తున్నారు.. మరి, ఏం జరుగుతుందో చూడాలి..