మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ ఇప్పుడు టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరో. తొలి చిత్రం ‘ఉప్పెన’తో బాక్సాఫీస్ భరతం పట్టిన ఈ మెగా కుర్రోడు.. హీరోయిన్స్ విషయంలోనూ మంచి సుడి కలిగిన హీరో అని చెప్పాలి. తొలి చిత్రంతోనే కృతి శెట్టిలాంటి అందాల భరిణతో రొమాన్స్ చేసి.. అభిమానుల్ని మెప్పించడం మామూలు విషయం కాదు. ఆ విషయంలో ‘ఉప్పెన’ మూవీ యంగ్ స్టర్స్ కి ఇన్స్ పిరేషన్ లాంటిది. ఈ సినిమా తెచ్చిపెట్టిన సూపర్ ఇమేజ్ తో వైష్ణవ్ తేజ .. మరో ఐదారు సినిమాల వరకూ అవకాశాలు అందుకున్నాడు.
‘ఉప్పెన’ సినిమా ఇంకా విడుదల కాకుండానే.. క్రిష్ దర్శకత్వంలో ఒక విలేజ్ స్టోరీలో నటించాడు. అడవి బ్యాక్ డ్రాప్ లో సాగే.. ఈ సినిమా టాకీ పార్టీ కూడా పూర్తయింది. ఈ మూవీలో కథానాయికగా రకుల్ ప్రీత్ సింగ్ నటించడం విశేషం. త్వరలోనే సినిమా విడుదల కాబోతోంది. ఇదిలా ఉంటే.. వైష్ణవ్ దీని తర్వాత మరో రెండు పెద్ద ప్రాజెక్ట్స్ కు కమిట్ అయ్యాడు. అందులో ఒక సినిమాలో కథానాయికగా కేతిక శర్మ నటించబోతోందని వార్తలొస్తున్నాయి.
పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాశ్ హీరోగా నటించిన ‘రొమాంటిక్’ మూవీ కేతిక శర్మకి కథానాయికగా తొలి సినిమా. ఈ సినిమా ఇంకా విడుదల కాకుండానే.. నాగశౌర్య స్పోర్ట్స్ మూవీ ‘లక్ష్య’లో హీరోయిన్ గా ఛాన్స్ కొట్టేసింది. ఈ సినిమా కూడా విడుదల కాకుండానే.. ఇప్పుడు వైష్ణవ్ తేజ సరికొత్త సినిమాలో హీరోయిన్ గా ఎంపికవడం విశేషం. కృతి శెట్టి లాగానే.. కేతిక శర్మ కూడా మొదటి సినిమా ఇంకా విడుదల కాకుండానే.. వరుస అవకాశాలు అందుకోవడం.. అది కూడా వైష్ణవ్ తేజ లాంటి హీరో సరసన నటించడం విశేషం. మరి ఈ పిల్ల కూడా ‘ఉప్పెన’ భామలాగానే.. క్రేజీ హీరోయిన్ అయిపోతుందేమో చూడాలి.