నాచురల్ స్టార్ నాని హీరోగా నటించిన ‘జెర్సీ’ ఉత్తమ చిత్రం కేంద్ర అవార్డుకు ఎంపికైంది. సూపర్ స్టార్ మహేష్ నటించిన ‘మహర్షి’ సినిమాకి మూడు అవార్డులు దక్కాయి. 67వ జాతీయ చలన చిత్ర అవార్డులను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీలో ఈ అవార్డుల వివరాలను వెల్లడించారు. జాతీయ ఉత్తమ చిత్రం (తెలుగు)గా ‘జెర్సీ’ ఎంపికైంది. సితార ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో ఈ సినిమాని నిర్మించింది. ఉత్తమ ఎడిటింగ్ విభాగంలో కూడా ‘జెర్సీ’ అవార్డు దక్కింది.
దీనికి ఎడిటర్‌గా వ్యవహరించిన నవీన్ నూలి ఈ అవార్డు కు ఎంపికయ్యారు. ఉత్తమ సినిమాటోగ్రాఫర్ విభాగంలో ‘జల్లికట్టు’ (మలయాళం) ఎంపికైంది. ఇక ఉత్తమ వినోదాత్మక చిత్రం, ఉత్తమ కొరియోగ్రఫీ, ఉత్తమ నిర్మాణ సంస్థ విభాగాల్లో ‘మహర్షి’ కి అవార్డులు దక్కాయి. తమ మహర్షి సినిమాకి జాతీయ అవార్డు దక్కడం ఎంతో సంతోషంగా ఉందని నిర్మాత దిల్ రాజు, వంశీ పైడిపల్లి అన్నారు.
అవార్డుల వివరాలు
* ఉత్తమ యాక్షన్ కొరియోగ్రఫీ: అవనే శ్రీమన్నారాయణ (కన్నడ)
* ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్: మరక్కర్ అరబ్ (మలయాళం)
* ఉత్తమ సంగీత దర్శకుడు: జ్యేష్ట పుత్రో
* ఉత్తమ మేకప్: హెలెన్
* ఉత్తమ గాయకుడు: కేసరి (తేరీ మిట్టీ)
* ఉత్తమ గాయని: బర్దో (మరాఠీ)