దేశం మొత్తం ఇంకా హాథ్రాస్ సంఘటన ఇంకా పూర్తిగా మార్చిపోక ముందే అటువంటి దారుణ ఘటనే ఖమ్మంలో చోటు చేసుకోవడం బాధాకరం. దాదాపు 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ మైనర్ బాలిక మృతి చెందింది. తల్లిదండ్రులకు ఆర్థికంగా సాయం అందించేందుకు ఖమ్మంలోని ఓ ఇంట్లో పనిలో చేరిన బాలికపై ఆ ఇంటి యజమాని కొడుకు అత్యాచారయత్నానికి యత్నించాడు. బాలిక ప్రతిఘటించడంతో బాలికపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. మళ్లీ అతనే బాలికను ఏమి తెలియని వాడిలా ఆసుపత్రిలో చేర్చాడు. విషయం తెలుసుకున్న బాలిక తల్లిదండ్రులు పోలీసులను ఆశ్రయించడంతో విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు మెరుగైన చికిత్స కోసం బాలికను హైదరాబాద్ కు తరలించారు. సుమారు 27 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ బాలిక గురువారం మరణించింది.
గుట్టుచప్పుడు కాకుండా పోస్ట్ మార్టం
హాథ్రాస్ ఘటనలో బాధితురాలి కుటుంబ సభ్యులు లేకుండా ఎలాగైతే పోస్ట్ మార్టం పూర్తి చేశారో.. అలాగే ఇక్కడ కూడా పోలీసులు బాలిక కుటుంబ సభ్యులు లేకుండా హడావిడిగా పోస్ట్ మార్టం పూర్తి చేసేశారు. ఇదేంటని మీడియా ప్రశ్నిస్తే అలాంటిది ఏమి జరగలేదని తోసిపుచ్చారు. పోలీసుల తీరుపై బాధితురాలి కుటుంబ సభ్యులు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ ప్రభుత్వాన్ని కోరారు.
తల్లికి వందనం షురూ.. 67.47 లక్షల మందికి లబ్ధి.. లోకేష్ ఎమోషనల్ పోస్ట్.!
ఆంధ్రప్రదేశ్‌లోని విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు కూటమి ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతో...











