మృగాళ్లు మరో దురాగతానికి పాల్పడ్డారు. ఖమ్మం జిల్లాలో ఓ బాలికపై అత్యాచారానికి ప్రయత్నించారు. ఆమె ప్రతిఘటించటంతో పెట్రోల్ పోసి నిప్పంటించేశారు. ఆమె ప్రస్తుతం ప్రాణాపాయ పరిస్థితిలో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది.
ఖమ్మంలో ఓ దారుణం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఖమ్మం టౌన్ లోనే ఈ దురాగతం జరిగింది. బాలికపై దుండగులు అత్యాచారానికి ప్రయత్నించారు.. కుదకరపోవడంతో- ఆమెపై పెట్రోలు పోసి నిప్పంటించారు. ఆమె పరిస్థితి విషమంగా ఉంది. ప్రయివేటు ఆసుపత్రిలో వైద్యం చేయిస్తున్నారు. ఈ మేరకు ఖమ్మం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా నమోదు అయింది.