తమిళ యాక్షన్ హీరో విశాల్ ప్రస్తుతం ‘చక్ర, తుప్పరివాలన్ 2’ సినిమాల షూటింగ్ హడావిడిలో ఉన్నాడు. అయితే ఈ రోజు అతడి కొత్త సినిమాకు సంబంధించిన బిగ్ అనౌన్స్ మెంట్ వచ్చింది. ప్రముఖ తమిళ నిర్మాణ సంస్థ మినీ స్టూడియో విశాల్ తో ఓ భారీ ప్రాజెక్ట్ చేయబోతున్నట్టుగా ట్విట్టర్ లో ప్రకటించారు. అంతేకాదు ఈ రోజే రామోజీ ఫిల్మ్ సిటిలో బిగిన్ అయిపోయింది కూడా. ‘అరిమనంబి (తెలుగులో ‘డైనమైట్’ గా రీమేక్ అయింది), ఇంకొక్కడు, నోటా’ సినిమాలు తెరకెక్కించిన ఆనంద్ శంకర్ ఈ సినిమాకి దర్శకుడు.
ఇక ఈ సినిమాలో ఆర్య విలన్ గా నటిస్తున్నట్టు తెలుస్తోంది. ఇంతకు ముందు విశాల్, ఆర్య .. బాల దర్శకత్వం వహించిన ‘అవన్ ఇవన్’ లో హీరోలుగా నటించారు. ఇదే సినిమా తెలుగులో ‘వాడు వీడు’ గా డబ్బింగ్ అయింది. ఇప్పుడు ఈ ఇద్దరూ హీరోగానూ, విలన్ గానూ తలపడనుండడం ఆసక్తిగా మారింది. ఆనంద్ శంకర్ ట్రాక్ రికార్డు సరిగా లేకపోయినా.. అతడికి ఈ పెద్ద ప్రాజెక్ట్ ను అప్పగించడం కోలీవుడ్ లో చర్చనీయాంశమైంది. మరి ఆనంద్ ఈ సినిమాను ఏ మేరకు హ్యాండిల్ చేస్తాడో చూడాలి.
https://twitter.com/MiniStudio_/status/1316998411183296512











