యంగ్ టైగర్ యన్టీఆర్ కి కోవిడ్ పాజిటివ్ రావడంతో .. ప్రస్తుతం హోం క్వారంటైన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం డాక్టర్స్ పర్యవేక్షణలో చికిత్స తీసుకుంటున్న ఆయన కోలుకోవాలని చాలా మంది కో స్టార్స్, హీరోలు ట్విట్టర్ వేదికగా తమ ఆకాంక్షను తెలియచేస్తున్నారు. ఇటీవల మెగాస్టార్ చిరంజీవికి తారక్ కు కాల్ చేసి మరీ ఆయన యోగ క్షేమాలు కనుక్కున్నారు.
తాజా గా తన అభిమాన హీరో తారక్ కోలుకోవాలని, మళ్ళీ హుషారు గా లేచి తిరగాలని ఒకప్పటి తమిళ హీరోయిన్ .. ఖుష్బూ తన ఆశాభావాన్ని వ్యక్తం చేసింది. గతంలో వీరిద్దరూ యమదొంగలో కలిసి నటించిన సంగతి తెలిసిందే. యముడు మోహన్ బాబు సహధర్మచారిణిగా అందులో ఆమె నటించింది. అప్పటి నుంచి తారక్ అన్నా , అతడి డ్యాన్స్, యాక్టింగ్ అన్నా ఖుష్బూకి చాలా ఇష్టం .ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో తన ఫేవరేట్ హీరో తారక్ అని ఆమె చెప్పిన సంగతి తెలిసిందే.
ఇప్పుడు తారక్ కు కోవిడ్ పాజిటివ్ వచ్చిందని తెలియగానే.. తన ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఒక పోస్ట్ పెట్టింది ఖుష్బూ. నా అభిమాన హీరో తారక్ .. తొందరగా కోలుకొని ఉరిమే ఉత్సాహంతో ఈ ప్రపంచాన్నిఏలాలని కోరుకుంటున్నాను. నీ రాక గురించి నేను ఎదురు చూస్తున్నాను. గెట్ వెల్ సూన్ అంటూ తన ఆకాంక్షను వెలిబుచ్చింది. ప్రస్తుతం ఖుష్బూ ట్వీట్ తారక్ అభిమానుల్ని ఖుషీ చేస్తోంది.
Wishing my favorite @tarak9999 a very speedy recovery from #Covid19 . Come back soon with more energy, more josh and take the world by storm. Waiting to see you groove again. Take care. Get well soon. ❤❤❤❤
— KhushbuSundar ❤️ (@khushsundar) May 13, 2021