టాలీవుడ్ లో వరుస సినిమాలను సెట్స్ పైకి తీసుకువెళ్తు దూసుకుపోతున్న హీరో నితిన్. త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘అఆ’ సినిమా తర్వాత నితిన్ కు వరుస పరాజయాలు పలకరించాయి. కొంచెం గ్యాప్ తీసుకొని `భీష్మ’ సినిమాలో నటించాడు నితిన్. ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు వచ్చిన `భీష్మ’ సినిమా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. నితిన్ సినీ జీవితంలోనే ఒక మంచి సినిమాగా `భీష్మ’ నిలిచిపోయింది. ఇక ఈ సక్సెస్ ఇచ్చిన జోష్ తో రెండు సినిమాలను పట్టాలెక్కించాడు నితిన్.
అందులో ఒకటి ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక నితిన్ నటిస్తున్న రెండో సినిమా ‘చెక్’. విలక్షణ దర్శకుడు అని పేరు ఉన్న చంద్రశేఖర్ ఏలేటి దర్శకత్వం అందిస్తున్నాడు. ఈ రెండు సినిమా షూటింగ్లు చివరి దశకు చేరుకున్నాయి. అలాగే వీటిపై నితిన్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘రంగ్ దే’, ‘చెక్’ సినిమాలను థియేటర్స్ లోనే రిలీజ్ చేయాలని మొదట భావించారు నిర్మాతలు. అయితే ఇప్పుడప్పుడే జనాలు సినిమా థియేటర్స్ కు వచ్చే పరిస్థితిలు కనపడటం లేదు. అందుకనే ఈ సినిమాలు ఇప్పుడు ఓటీటీల వైపు చూస్తున్నాయి.
ఇప్పటికే ‘రంగ్ దే’ సినిమాకు అనేక ఓటీటీ సంస్థల నుండి మంచి ఆఫర్స్ వచ్చాయి. కాని నిర్మాతలు ఫైనల్ చేయలేదు. తాజాగా అందుతున్న టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం ‘రంగ్ దే’ సినిమాను ప్రముఖ ఓటీటీ సంస్థ అయిన జీ5లో రిలీజ్ చేయడానికి దర్శక నిర్మాతలు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఇప్పటికే నిర్మాతలు, జీ5 సంస్థ ప్రతినిధులతో ఒక అవగాహనకు వచ్చారని తెలుస్తోంది. ఇక ‘చెక్’ సినిమాను కూడా జీ5లోనే రిలీజ్ చేయాలని నిర్మాతలు భావిస్తున్నారట. ఇందుకు సంబంధించిన చర్చలు కూడా జరిగాయని తెలుస్తోంది. ఈ రెండు సినిమాల విడుదల విషయంలో త్వరలోనే ఒక అధికారిక ప్రకటన వస్తుందట. నితిన్ సినిమాను థియేటర్స్ లో చూద్దామని అనుకుంటున్న అభిమానులకు ఈ వార్త పెద్ద షాక్ అనే చెప్పాలి.
Must Read ;- మల్దీవ్స్ లో బికినీ తో సందడి చేస్తోన్న రకుల్ ప్రీత్ సింగ్











