పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, బాలీవుడ్ హీరో సయీఫ్ అలీఖాన్ లాంటి భారీ తారాగాణం, 500 కోట్ల భారీ ప్రాజెక్ట్, పురాణ కథ ‘రామాయణం’తో సినిమా.. ఇంత పెద్ద ప్రాజెక్టుకు ఆదిలోనే హంసపాదు ఎదురైంది. ఎందుకనేదే ఇప్పుడు అందరి మదినీ తొలుస్తున్న ప్రశ్న. ఓంరౌత్ దర్శకత్వంలో టీసిరీస్ లాంటి పెద్ద సంస్థ ఈ చిత్ర నిర్మాణాన్ని చేపట్టింది. నిన్న ఉదయం ‘ఆదిపురుష్’ ఆరంభ్ అంటూ భారీ ప్రచారానికి తెర తీశారు. ముంబైలోని గోరేగావ్ లో వేసిన భారీ సెట్ లో షూటింగ్ ప్రారంభించారు.
అంతా సవ్యంగా జరుగుతుందనుకుంటున్న తరుణంలో పెద్ద ఎత్తున మంటలు లేచాయి. సెట్ అంతా అగ్నికి ఆహుతైంది. చిత్ర యూనిట్ ఆందోళనకు గురైంది. అదృష్టవశాత్తూ ప్రభాస్, సయీఫ్ లు కూడా ఆ ప్రమాదానికి దూరంగా ఉన్నారు. ఎవరికీ ప్రాణాపాయం జరగకపోయినా శుభమా అంటూ ఇంత పెద్ద ప్రాజెక్టును ప్రారంభిస్తే ఇలా జరిగిందేమిటబ్బా అన్న అందరి మదినీ తొలుస్తోంది. అసలు ‘ఆదిపురుష్’ సినిమా రాముడికీ, రావణాసురుడికీ చెందిన కథతో రూపొందుతోందన్న ప్రచారం ఉంది.
నిజానికి ఈ సెట్ చూస్తే ఈ కథకు ఇలాంటి సెట్ ఏమిటన్న అనుమానం కలుగుతోంది. పైగా ఇలాంటి పురాణ కథను ఎంచుకునేటప్పుడు మంచి ముహూర్తం చూసుకోవాలి.. మూఢంలో ఈ సినిమా ఎందుకు ప్రారంభించినట్టు లాంటి ప్రశ్నలు ఎదురవుతున్నాయి. నెటిజన్లలో ఈ సినిమాకి సంబంధించి ఎన్నో ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రభాస్ ఈ సినిమా అంగీకరించకుండా ఉండాల్సింది అన్న కామెంట్లు కూడా మరో వైపు నుంచి వినిపిస్తున్నాయి. మొత్తానికి దేశవ్యాప్తంగా ఈ ప్రమాదం సెన్సేషన్ అయ్యింది.ఇందులో సీతగా కృతి సనన్ నటిస్తోంది. కౌసల్య పాత్ర కోసం హేమమాలినిని తీసుకున్నారు.
లక్ష్మణుడిగా సన్నీ సింగ్... రావణాసురుడి కుమారుడు మేఘనాథుడిగా అంగద్ బేడీ.. లాంటి తారాగణం. వచ్చే ఏడాది ఆగస్ట్ 11న సినిమాని విడుదల చేయనున్నట్లు ముందే ప్రకటించారు. అసలు ఇది ఏ తరహా కథ, దర్శకుడికి ఈ కథను వక్రీకరించి చెప్పే ప్రయత్నం చేస్తున్నాడా? లాంటి కొత్త ఆలోచనలు కూడా ఇప్పుడొస్తున్నాయి. ఇప్పటిదాకా అనేక సందర్భాల్లో రామాయణాన్ని జనం చూశారు. మరి ఇందులో కొత్తగా చెప్పేదేముంటుందో ఎవరికీ అర్థం కావడం లేదు. ఈ ప్రమాదంతో ఇలాంటి ప్రశ్నలు మరిన్ని వ్యాప్తిలోకి వచ్చే అవకాశం ఉంది. మళ్లీ ఈ సినిమా షూటింగ్ ఎప్పుడు ప్రారంభమవుతుందన్నది ప్రశ్నార్థకమే.
సలార్ యూనిట్ కు రోడ్డు ప్రమాదం
ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘సలార్’ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఆదిపురుష్ అగ్నిప్రమాదం వార్తను మరువకముందే సలార్ యూనిట్ రోడ్డు ప్రమాదనాకి గురైంది. గోదావరిఖని– శ్రీనగర్ జాతీయ రహదారిపై వీరి వ్యాన్ ను లారీ డీకొట్టింది. చిత్ర యూనిట్ లోని పలువురికి గాయాలయ్యాయి. ఇలా ఒకే హీరోకి సంబంధించి రెండు ప్రమాదాలు జరగడం చర్చనీయాంశమంది. ఇది కాకతాళీయమా? మరొకటా అనే చర్చ కూడా నడుస్తోంది.
Must Read ;- ప్రభాస్ ‘ఆదిపురుష్’ మూవీకి ఆది నుంచి కష్టాలే..!