బాలీవుడ్ తో పోల్చితే .. తెలుగులో స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కే మూవీస్ తక్కువే. అలాగే.. ఆ కేటగిరిలోని బయోపిక్స్ కూడా తక్కువే. పుల్లెల గోపీచంద్, సైనా నెహ్వాల్, సింధు లాంటి స్పోర్ట్స్ స్టార్స్ బయోపిక్స్ రాబోతున్నాయనే టాక్సే వినిపించాయి కానీ అవేవీ.. ఇంతవరకూ కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు వాటి లిస్ట్ లోకి ప్రముఖ మహిళా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కరణం మల్లీశ్వరి బయోపిక్ కూడా చేరిపోయింది.
2000 సిడ్నీ ఒలింపిక్స్ లో భారత దేశానికి మెడల్స్ సాధించి పెట్టి.. గర్వకారణంగా మారింది కరణం మల్లీశ్వరి. శ్రీకాకుళానికి చెందిన ఈ తెలుగు లెజండరీ వెయిట్ లిఫ్టర్ జీవిత కథ తో ఓ సినిమా రాబోతున్నట్టు ఆ మధ్య ఎప్పుడో అనౌన్స్ మెంట్ వచ్చింది. రంగంలోకి ప్రముఖ రచయిత, నిర్మాత కోన వెంకట్ వచ్చారు.
సంజనా రెడ్డి అనే మహిళా దర్శకురాలు .. ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు కూడా తెలిపారు. అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఒక్క అప్టేట్ కూడా లేదు. అయితే ఈ సినిమాను మొదలు పెట్టకుండానే ఆపేస్తున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి కారణాలైతే తెలియదు కానీ.. ఇందులో మల్లీశ్వరి పాత్ర కోసం రకుల్ ప్రీత్ సింగ్ ను గట్టిగా ప్రయత్నించారట. మరి ఈ సినిమా భవిష్యత్తులోనైనా ఉంటుందా ఉండదా అనే వివరాలు తెలియాలంటే.. కోనవెంకట్ నోరు విప్పాల్సిందే.
Must Read ;- కరణం మల్లీశ్వరి బయోపిక్ లేనట్టేనా?











