కిన్నెర మొగులయ్యను చూడగానే… జులపాల జుట్టు, పంచెకట్టు, పల్లెటూరి అమాయకత్వం గుర్తుకువస్తోంది ఎవరికైనా. వీరుల గాథలను వివరిస్తూ కిన్నెర గానంతో చేస్తుంటే.. ఎంతటివాళ్లయినా కరిగిపోవాల్సిందే. ‘ఆడా లేడు మియ్యా సావ్.. ఈడా లేడు మియ్యా సావ్’ ..అంటూ తన గానంతో మైమరిపిస్తాడు. ఆ ఆరుదైన కళాకారుడే దర్శనం మొగలయ్య. కిన్నెర వాయిద్యాన్ని పలికించే అరుదైన కళాకారుడు. నాగర్‌కర్నూలు జిల్లా తెల్కపల్లి మండలం గట్టురాయిపాకుల. ఆయన జీవిత చరిత్ర ఎనిమిదవ తరగతి సాంఘిక శాస్త్రంలో పాఠ్యాంశంగా కూడా ఉంది. కానీ.. ఆయన జీవితమే దుర్భరంగా మారింది.
అద్దెకుంటూ.. భిక్షాటన చేస్తూ
తెలంగాణ ఆవిర్భావం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా ఉగాది పురస్కారాన్ని అందుకున్న మొగులయ్య.. నేడు దీనస్థితిలో జీవిస్తున్నాడు. చిన్న రేకుల ఇంట్లో అద్దెకుంటూ.. భిక్షాటన చేస్తూ పొట్టపోసుకుంటున్నాడు. ఒకవైపు భర్తను కోల్పోయిన కూతురు, మరోవైపు అనారోగ్యంతో బాదపడుతున్న కొడుకుతో దుర్భర దారిద్ర్యం అనుభవిస్తున్నాడు. పొట్ట కూటీ కోసం బిక్షాటన చేస్తున్న ఈ అరుదైన కళాకారుడిని చూసి ప్రతిఒక్కరూ జాలిపడుతున్నారు. అయ్యో… మొగులయ్య అంటూ పదో, పరకో ఇస్తు ఉదారతను చాటుకుంటున్నారు. ఇకనైనా ప్రభుత్వం స్పందించి, తమను ఆదుకోవాలని మొగులయ్య కోరుతున్నాడు.
Must Read ;- కేసీఆర్.. నీకు ఆ దమ్ముందా? సీఎంపై విజయశాంతి ఫైర్











