విక్టరీ వెంకటేశ్ ప్రస్తుతం ‘నారప్ప, ఎఫ్ 3’ చిత్రాల్లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. తమిళ అసురన్ కు రీమేక్ వెర్షన్ గా రానున్న నారప్ప మే 14న విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించినా.. కరోనా సెకండ్ వేవ్ మూలంగా.. సినిమా విడుదల వాయిదా పడే అవ కాశాలున్నాయంటున్నారు. అలాగే.. ఆగస్ట్ 27న ‘ఎఫ్ 3’ సినిమా కూడా విడుదల తేదీ లాక్ చేసుకుంది. అయితే వీటితో పాటు వెంకీ నటిస్తోన్న మరో సినిమా ‘దృశ్యం 2’ . ఇందులో వెంకీ షూట్ కు సంబంధించిన పార్ట్ ఇటీవలే కంప్లీట్ అయింది. అలాగే.. మరో పదిరోజుల్లో మొత్తం టాకీ పార్ట్ కూడా పూర్తవుతుంది.
వీటిలో ‘నారప్ప’ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకోగా.. ‘ఎఫ్ 3’ తాజా షెడ్యూల్ ను త్వరలోనే మైసూర్ లో ప్రారంభించబోతోంది. అయితే ప్రస్తుతం కరోనా మళ్ళీ విజృంభిస్తున్న నేపథ్యంలో పెద్ద సినిమాలన్నీ విడుదలలు వాయిదా వేసుకుంటున్న సంగతి తెలిసిందే. అందుకే ‘దృశ్యం 2 సినిమాను, ఎఫ్ 3’ చిత్రాల్ని త్వరలో ఓటీటీలో విడుదల చేయబోతున్నారని టాక్స్ వినిపిస్తున్నాయి. ఆ మేరకు సురేశ్ ప్రొడక్షన్స్ అధినేత సురేశ్ బాబుకి.. ఓటీటీ నుంచి పెద్ద డీల్ వచ్చిందట.
‘దృశ్యం 2’ ఒరిజినల్ వెర్షన్ ను థియేటర్స్ తెరిచినా.. ఓటీటీలోనే విడుదల చేశారు ఆ సినిమా నిర్మాతలు. సినిమా సూపర్ హిట్ అవడమే కాకుండా.. నిర్మాతలకు లాభాలు కూడా వచ్చిపడ్డాయి. సరిగ్గా అదే విధంగా.. ‘దృశ్యం 2’ తెలుగు సినిమా ను కూడా ఓటీటీలో విడుదల చేయాలని మేకర్స్ భావిస్తున్నారట. మలయాళ సినిమాను చిత్రీకరించిన లొకేషన్స్ లోనే తెలుగు వెర్షన్ ను చిత్రీకరించాడు దర్శకుడు జీతు జోసెఫ్. నటీనటుల పారితోషికాలు తప్ప.. మలయాళ సినిమాకి, తెలుగు సినిమాకి ఖర్చుల్లో వ్యత్యాసం ఉండదు. అందుకే ‘దృశ్యం 2’ తెలుగు వెర్షన్ ఓటీటీలో విడుదలైనా.. లాభదాయకమైన ప్రాజెక్టేనని భావిస్తున్నారట మేకర్స్. అలాగే.. దీని తర్వాత ఎఫ్ 3 చిత్రాన్ని కూడా ఓటీటీలో విడుదల చేయాలని చూస్తున్నారట. మరి దృశ్యం 2 థియేటర్స్ లో విడుదలవుతుందో, ఓటీటీలో విడుదలవుతుందో చూడాలి .
Must Read ;- సినిమా గుండెల్లో కరోనా గుబులు.. విడుదల వాయిదా