బీజేపీ నాయకురాలు, సినీ నటి విజయశాంతి మరోసారి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, స్వయంగా మంత్రులే భూ కబ్జాలు, వ్యాపారాలను బెదిరిస్తున్నారని ఆరోపించారు. డ్రగ్స్ కేసులో నలుగురు ఎమ్మెల్యేలపై తీవ్ర ఆరోపణలున్నాయని, వాళ్లను తప్పించే సత్తా, అవినీతి మంత్రులపై చర్యలు తీసుకునే దమ్ము ఉందా…? అని విజయశాంతి సవాల్ విసిరారు.
కరోనా విషయంలో రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందని అన్నారు. రోజుకు 7,600 ఆర్టీపీసీఆర్ టెస్టులు చెయ్యాలని కేంద్రం సూచిస్తే, ఇవి నాలుగైదు వేలు కూడా చేయడం లేదని అన్నారు. కరోనా కట్టడికి వైన్ షాపులు, బార్లు, పబ్‌లు, థియేటర్లపై ఎందుకు ఆంక్షలు విధించడం లేదో చెప్పాలన్నారు. తెలంగాణాలో గొప్ప పరిపాలన జరుగుతుందని పదే పదే ప్రగల్భాలు పలికే కేసీఆర్… వీటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
Must Read ;- భయంతో కూడిన గౌరవమా.. కేసీఆర్ సాబ్ ఏంటా రహస్యం?