మొన్నటి సార్వత్రిక ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు చాలా మంది నేతలను హీరోలను చేయడంతో పాటుగా… చాలా మంది నేతలను జీరోలను కూడా చేశాయి. అలా అప్పటిదాకా హీరోలుగా వెలిగి.. మొన్నటి ఎన్నికల ఫలితాల తర్వాత జీరోలుగా మారిన నేతల్లో ఇద్దరు నేతల పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. మొన్నటిదాకా నిత్యం వార్తల్లో నిలిచి ఆ ఇద్దరు నేతలు ఇప్పుడు భూతద్దం పెట్టుకుని వెదిరినా కనిపించడం లేదు. అయితే వార్తల్లో వారి పేర్లు మాత్రం అప్పుడప్పుడూ వినిపిస్తున్నాయి. అది కూడా పరారీలో ఉన్న నేతలుగా సదరు ఇద్దరు నేతలు అపఖ్యాతి మూటగట్టుకున్నారు.
ఈ ఇద్దరు బూతు నేతలు టీడీపీతోనే రాజకీయ ఓనమాలు నేర్చినప్పటికీ… ఇప్పుడు అదే పార్టీ అదికారంలోకి రావడంతో పరారైపోయారు. ఎక్కడ టీడీపీ తమను బుక్ చేసి పారేస్తుందోనన్న భయంతోనే వారిద్దరూ ఇలా పలాయనవాదం ఎంచుకున్నారన్న విశ్లేషణలు వినిపిస్తున్నాయి. వారిలో ఒకరు గుడివాడలో ఎదురు లేని నేతగా ఎదిగి.. వరుసబెట్టి అటు టీడీపీలోనే కాకుండా ఇటు వైసీపీలోనూ వరుస విజయాలు అందుకున్న మాజీ మంత్రి కొడాలి శ్రీవేంకటేశ్వరరావు అలియాస్ కొడాలి నాని కాగా… మరొకరు విజయవాడ శివారు గన్నవరంలో వైసీపీ సునామీని తట్టుకుని నిలిచిన నేతగా పేరు తెచ్చుకున్న వల్లభనేని వంశీ మోహన్.
https://youtu.be/7eEGuTheENM
వైసీపీ అదికారంలోకి రాగానే… కొడాలి నాని మంత్రిగా పదవి దక్కించుకున్నారు. నోరు తెరిస్తే బూతులు తప్పించి మరో మాట వినిపించని నాని… నిత్యం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. టీడీపీలోనే… చంద్రబాబు ప్రోత్సాహంతోనే రాజకీయాల్లోకి వచ్చన నాని… ఆపై చంద్రబాబుతో పాటు నారా లోకేశ్ పై నిత్యం బూతులతో విరుచుకుపడ్డారు. చంద్రబాబును నాని దూషించినంతగా మరే నేత దూషించలేదంటే అతిశయోక్తి కాదేమో. ఇటు మీడియా మైకుల ముందే కాకుండా అటు చట్టసభల్లోనూ చంద్రబాబుపై నాని చేసిన వ్యాఖ్యలు నిజంగానే జుగుప్సను కలిగించాయని చెప్పక తప్పదు.
ఇక మంత్రి హోదాలో ఉండి కూడా బూతులతోనే విపక్షాలకు సమాధానాలు చెప్పిన నేతగా కొడాల నాని మరే నేతకు లేని ప్రత్యేకత ఉందని చెప్పాలి. అసెంబ్లీలో మాట్లాడిన సందర్భంలోనూ నాని…తన నోరును అదుపులో పెట్టుకోలేకపోయారు. ఫలితంగా నోటిపై అదుపు లేని నేతగా నాని అపఖ్యాతి మూటగట్టుకున్నారని చెప్పాలి. జగన్ ను వెనకేసుకుని రావడం అంటే… చంద్రబాబును తిట్టడమే మార్గమన్నట్లుగా నాని వ్యవహరించిన తీరు అటు టీడీపీ నేతలతో పాటుగా ఇటు వైసీపీ నేతలకూ తీవ్ర అసహనాన్ని మిగిల్చిందని చెప్పక తప్పదు.
ఇక కుటుంబానికి రాజకీయ నేపథ్యం ఏమీ లేకున్నా కూడా విజయవాడ పార్లమెంటు లాంటి కీలక లోక్ సభ స్థానం టికెట్ ను దక్కించుకున్న వల్లభనేని వంశీ.. టీడీపీలో ఓ యువ కెరటంలా దూసుకువచ్చారు. ఎంపీగా ఓడినా… టీడీపీలో ఆయనకు ఎంతమాత్రం ప్రాధాన్యం తగ్గలేదు. గన్నవరం లాంటి కీలక అసెంబ్లీ టికెట్ ను ఆయనకు టీడీపీ కేటాయించింది. పార్టీకి విధేయుడిగానే కొనసాగిన వంశీ… గన్నవరం నుంచి వరుసగా ఎమ్మెల్యేగా గెలుస్తూ వచ్చారు. 2019లో వైసీపీ దిశగా బలమైన గాలి వీయగా… ఆ గాలిని తట్టుకుని కూడా వంశీ నిలబడ్డారు. గన్నవరం నుంచి వరుసగా మూడో పర్యాయం ఆయన ఎమ్మెల్యేగా గెలిచారు.
కొడాలి నానితో స్నేహమో… జగన్ అంటే భయమో తెలియదు గానీ… వైసీపీ అధికారంలో ఉండగా… ఆ పార్టీకి దగ్గరయ్యారు. ఆ తర్వాత నానితో కలిసి చంద్రబాబు. లోకేశ్ లను ఇబ్బంది పెట్టడంలో ముందు వరుసలో కొనసాగారు. నానిని మించిపోయినట్లుగా వ్యవహరించిన వంశీ… చంద్రబాబు సతీమణిపై అసెంబ్లీలోనే ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసి టీడీపీకి బద్ధ శత్రువుగా మారిపోయారు. ఈ ఘటన కారణంగా మొన్నటి ఎన్నికల్లో వంశీ గన్నవరంలో ఓడిపోయారు.
ఎన్నికలు ముగిసిన తర్వాత ఒకటి, రెండు సార్లు కనిపించన ఈ ఇద్దరు నేతలు ఆ తర్వాత అడ్రెస్ లేకుండా పోయారు. వైసీపీ అధికారంలో ఉండగా… ఈ ఇద్దరు నేతలు చేసిన అరాచకాలపై టీడీపీ నేతృత్వంలోని కూటమి సర్కారు ఆరా తీస్తోంది. వంశీపై ఇప్పటికే కేసులు నమోదు కాగా… నానిపై కేసులు పెట్టేందుకు రంగం సిద్ధమైపోయంది. ఎలాగూ తాము టీడీపీని, ఆ పార్టీ అధినాయకత్వాన్ని దూషించిన తీరును గుర్తు చేసుకున్న ఈ ఇద్దరు నేతలు…తమకు భవిష్యత్తు లేదని గ్రహించనట్టున్నారు. కూటమి సర్కారు పాలనాబాధ్యతలు స్వీకరించిన రోజుల వ్యవధిలోనే పరారైపోయారు.
ప్రస్తుతం వీరిద్దరూ తమ సొంతూళ్లను, తమను ఏళ్ల తరబడి గెలిపించిన ప్రజలను వదిలేసి ఎంచక్కా అండర్ గ్రౌండ్ లోక వెళ్లిపోయారు. ఇక వారిి విజయాల్లో కీలక భూమక పోషించిన వారి అనుచరులు ఇప్పుడు దిక్కులేని వారుగా మారపోయారని చెప్పాలి. తమ అనుచరులను గాలికి వదిలేసిన నాని, వంశీలు ప్రస్తుతం తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో ఎంచక్కా ఏసీల్లో పడుకొని సేద తీరుతున్నట్లుగా సమాచారం.











