కోల్‌కతా ఎట్టకేలకు విజయాల బాట పట్టింది. పంజాబ్‌తో జరిగిన మ్యాచ్‌లో 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేకేఆర్ జట్టులో రాహుల్ త్రిపాఠి(41), కెప్టెన్ ఇయాన్ మోర్గాన్(47) రాణించారు. పంజాబ్ బౌలర్లలో హెన్రిక్స్, షమి, హుడా, అర్షదీప్ తలా ఒక వికెట్ తీసుకున్నారు.
ఎట్టకేలకు శుభారంభం..
లక్ష్య ఛేదనలో కోల్‌కతాకు శుభారంభం లభించలేదు.17 పరుగులకే ఓపెనర్లతో పాటు నరైన్ వికెట్‌ను కోల్పోయింది కోల్‌కతా. వీరిలో రానా, నరైన్ డకౌట్ అయ్యాడు. ఈ దశలో జట్టుకట్టిన కెప్టెన్ మోర్గాన్-రాహుల్ త్రిపాఠి జోడీ నాలుగో వికెట్‌కు 66 పరుగుల భాగస్వామ్యం నమోదు చేసి.. జట్టును సురక్షిత స్థితికి తీసుకొచ్చారు. ఆ తర్వాత ఓ అనవసరపు షాట్‌కు యత్నించి త్రిపాఠి ఔటయ్యాడు. మిగిలిన పనిని మోర్గాన్ పూర్తి చేశారు.
Must Read ;- ఆకాశమే హద్దుగా : రవీంద్ర జడేజా సిక్సర్ల వర్షం, ఒకే ఓవర్లో 37











