(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
వారం రోజులుగా అజ్ఞాతంలో గడిపిన టీడీపీ శ్రీకాకుళం జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్ గురువారం పొందూరు పోలీస్‌స్టేషన్‌లో లొంగిపోయారు. ఆయనను పోలీసులు రాజాం కోర్టుకు తరలించారు. రాజాం మండలం పొగిరి ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో రవికుమార్‌కు కరోనా వైద్య పరీక్షలు నిర్వహించిన అనంతరం రాజాం కోర్టుకు తరలించారు. జిల్లా పరిషత్ ఎన్నికల పోలింగ్ రోజున పొందూరు మండలం పెనుబర్తి వైఎస్సార్సీపీ ఎంపీటీసీ అభ్యర్థి ఇంటిపై అనుచరులతో కలిసి కూన రవికుమార్ దాడి చేసిన ఘటనలో ఆయనపై కేసు నమోదయ్యింది. దీంతో పోలీసులు తనను అరెస్టు చేస్తారనే భయంతో కూన అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అప్పటి నుండి పోలీసులు ఆయన కోసం గాలిస్తున్నారు. వారి ఇంటిలోకి వెళ్లి అనువనువూ గాలించారు. గురువారం ఆయనే నేరుగా పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు.
Must Read ;- తమ్మినేని సభలో నిరుద్యోగి ఆత్మహత్యాయత్నం











