ఈ సంక్రాంతికి ‘క్రాక్’ సినిమా తో బ్లాక్ బస్టర్ అందుకొని తిరిగి ఫామ్ లోకి వచ్చేసిన మాస్ మహారాజా రవితేజ ప్రస్తుతం ‘ఖిలాడి’ అనే యాక్షన్ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రాక్షసుడు ఫేమ్ రమేశ్ వర్మ రూపొందిస్తున్న ఈ సినిమాలో రవితేజ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘ఖిలాడి’ టీజర్ కు సూపర్ రెస్సాన్స్ వచ్చిన నేపథ్యంలో సినిమా మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. మే 28న విడుదల చేస్తున్నట్టు మేకర్స్ ఎప్పుడో ప్రకటించిన సంగతి తెలిసిందే.
అయితే ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ కారణంగా..కేసులు పెరుగుతున్న నేపథ్యంలో పలు చిత్రాలు విడుదల తేదీలు మార్చుకున్నాయి. కానీ రవితేజ మాత్రం ‘ఖిలాడి’ విడుదల విషయంలో మాత్రం నో కాంప్రమైజ్ అంటున్నాడట. ముందు గా నిర్ణయించిన విడుదల తేదీలోనే పక్కాగా విడుదల చేయాలని చూస్తున్నాడట. అయితే అదే రోజు బాలకృష్ణ ‘అఖండ’ సినిమా కూడా విడుదల కాబోతోంది. ఇప్పటి వరకూ ఈ సినిమా రిలీజ్ డేట్ విషయంలో మార్పులు గురించి అయితే ఏమీ అప్టేట్ రాలేదు. మరి రవితేజ నిజంగానే మే 28న వస్తాడో లేదో చూడాలి.
Must Read ;- టీజర్ టాక్ : మైండ్ గేమ్ ఆడే ‘ఖిలాడి’ గా మాస్ మహారాజా