(శ్రీకాకుళం నుండి లియో న్యూస్ ప్రతినిధి)
రాష్ట్ర శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, రాష్ట్ర మంత్రి అప్పలరాజు పాల్గొన్న వాలంటీర్ల సత్కార సభలో ఒక నిరుద్యోగి ఆత్మహత్య యత్నానికి పాల్పడి అలజడి సృష్టించాడు. గతంలో తాను ఆముదాలవలస మున్సిపాలిటీలో తాత్కాలిక ప్రాతిపదికన స్వీపర్‌గా పని చేశానని, అయితే వైసీపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తనను తొలగించారని లొట్టి అనిల్ కుమార్ అనే యువకుడు ఆరోపించాడు. ఈ విషయంపై తాను స్పీకర్, మంత్రికి వినతిపత్రం ఇద్దామని వేదిక పైకి వెళ్లేందుకు ప్రయత్నించానని, తనను కొంతమంది వేదికపైకి వెళ్లనీయకుండా అడ్డుకోవడంతో మనస్థాపంతో బ్లేడుతో ఛాతిపై, మెడపై కోసుకునేందుకు యత్నించానని యువకుడు పేర్కొన్నాడు. కాగా అక్కడే ఉన్న పోలీసులు ఆ యువకుడిని పట్టుకుని అతని చేతిలో ఉన్న బ్లేడును స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో స్వల్పంగా గాయపడిన అనిల్ కుమార్‌ను అధికారులు శ్రీకాకుళం రిమ్స్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
Must Read ;- నెల్లూరు వైసీపీలో విభేదాలు.. మంత్రి అనిల్ అసహనం











