మాస్ మహారాజా రవితేజ, యాక్షన్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కలయికలో తెరకెక్కుతోన్న మూడో సినిమా ‘క్రాక్’. ‘డాన్ శీను, బలుపు’ సినిమాలతో మంచి సక్సెస్ సాధించిన నేపథ్యంలో ఈ మూవీ మీద భారీ అంచనాలు నెలకొన్నాయి. ఓ మర్డర్ కేస్ ఇన్వెస్టిగేషన్ కోసం బరిలోకి దిగిన ఓ యారోగెంట్ పోలీసాఫీసర్ .. లోకల్ పొలిటికల్ కింగ్ పిన్ తో ఢీ కొట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. అప్పుడు అతడి యాక్షన్, రియాక్షన్ ఏ రేంజ్ లో ఉండబోతుంది అనేదే ‘క్రాక్’ మూవీ కథాంశం.
నిజానికి ఈ సినిమా.. తమిళ విజయ్ సేతుపతి హీరోగా నటించిన ‘సేతుపతి’ సూపర్ హిట్ మూవీకి ఫ్రీమేక్ అనే ప్రచారం జరుగుతోంది. ఆల్రెడీ ఆ సినిమాను.. ఘంటా రవితేజ హీరోగా ‘జయదేవ్’ పేరుతో రీమేక్ చేశారు కానీ. రిజల్ట్ తేడా కొట్టింది. అయినా సరే.. రవితేజ తో అదే కథ కు కొద్ది పాటి మార్పులు చేసి .. గోపీచంద్ మలినేని ‘క్రాక్’ గా తెరకెక్కిస్తున్నాడు. ‘విక్రమార్కుడు, పవర్ , టచ్ చేసి చూడు’ లాంటి సినిమాల్లో రవితేజ పోలీస్ గా అదరగొట్టాడు. ఇది కూడా ఆ తరహాలోనే ఆడియన్స్ ను మెప్పిస్తుందనే నమ్మకంతో ఉన్నారు మేకర్స్.
ఇక క్రాక్ మూవీ షటింగ్ కు కోవిడ్ 19 కారణంగా ఏడునెలల బ్రేక్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ మధ్యే ఈ సినిమా తిరిగి సెట్స్ మీదకు వెళ్ళింది . కరోనా నిబంధనల్ని పక్కాగా పాటిస్తూ.. ఈ సినిమా షూటింగ్ ను జరుపుతున్నారు. ఈ నేపథ్యంలో క్రాక్ సినిమా షూటింగ్ కు సంబంధించిన రీ స్టార్ట్ దృశ్యాల్ని వీడియో రూపంలో విడుదల చేశారు మేకర్స్. రవితేజ సరసన శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తోన్న ఈ సినిమాలో విలన్ గా సముద్రఖని నటిస్తున్నారు.
‘క్రాక్’ మేకింగ్ వీడియో వీక్షించడానికి కింది లింక్ మీద క్లిక్ చేయండి
https://www.youtube.com/watch?v=fw_nVTIGfQA&feature=emb_logo











