మాస్ మహారాజా రవితేజ పోలీస్ ఆఫీసర్ గా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కుతోన్న యాక్షన్ ఎంటర్ టైనర్ ‘క్రాక్’. తమిళ ‘సేతుపతి’ చిత్రానికి ఇది ఫ్రీమేక్ అని ఎప్పటి నుంచో వినబడుతోంది. ఒక కాంప్లికేటెడ్ కేస్ ను ఇన్వెస్టిగేషన్ చేయడానికి నియమింపబడిన ఒక ‘క్రాక్’ పోలీసాఫీసర్.. ప్రత్యర్ధుల్ని ఎలా ఒణికిస్తాడు అనే కథాంశంతో ఈ సినిమా తెరకెక్కుతోంది. ‘విక్రమార్కుడు, పవర్, టచ్ చేసి చూడు’ లాంటి సినిమాల్లో పోలీస్ పవర్ చూపించిన రవితేజ.. క్రాక్ తో తన నట విశ్వరూపం చూపించబోతున్నాడని టాక్ వినిపిస్తోంది.
మేజర్ పార్ట్ షూట్ చేసుకొని .. విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో లాక్ డౌన్ వచ్చి పడింది. దాంతో క్రాక్ సినిమా షూటింగ్ కు బ్రేక్ పడింది. దాదాపు ఏడేళ్ళ తర్వాత తిరిగి ఈ సినిమా షూటింగ్ నిన్ననే ప్రారంభమైంది. హైదరాబాద్ లోని రామోజీ ఫిల్మ్ సిటీలో ముఖ్యమైన సన్నివేశాల్ని చిత్రీకరిస్తున్నారు. అక్టోబర్ 15 నుంచి థియేటర్స్ తెరవబోతున్నారు. అందుకే ఈ సినిమాను థియేటర్స్ లోనే విడుదల చేసేందుకు మేకర్స్ నిర్ణయించుకున్నారు. ‘డాన్ శీను, బలుపు’ తర్వాత రవితేజ తో గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న సినిమా‘క్రాక్’. ఇది ఖచ్చితంగా హ్యాట్రిక్ హిట్టు అవుతుందని నమ్మతున్నాడు దర్శకుడు. మరి రవితేజ ఈ సినిమాతో ఎంతటి క్రాక్ ఇమేజ్ తెచ్చుకుంటాడో చూడాలి.
We are so happy to resume our shoot with so much of happiness and with great energy around us ❤️. We thank u from the heart for the greatest support. All the updates will follow on very soon .#staysafe #worksafe
Team #krack🔥🔥 pic.twitter.com/7wK0H2pDdi
— Gopichandh Malineni (@megopichand) October 7, 2020











