హైదరాబాద్‌లో వర్ష బీభత్సానికి కాలనీలు బురద మయంగా మారాయి. డ్రైనేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. కొన్ని చోట్ల డ్రైనేజీ పొంగిపొర్లి మురుగు రోడ్లపై పారుతోంది. ఎటు చూసినా వరదే ఉండడంతో ప్రజల నుంచి మంత్రి కేటిఆర్‌కు వినతులు వెల్లువలా వస్తున్నాయి. అంతే స్పీడుగా వాటిపై మంత్రి కేటిఆర్ కూడా స్పందిస్తున్నారు.
మంత్రి కేటీఆర్‌కు తన హైస్కూల్ గురువు నుంచి ఒక వినతి వచ్చింది. భారీ వర్షాలకు అడిక్‌మెట్ డివిజన్ లలితానగర్‌లో డ్రైనేజీ ఓవర్ ఫ్లో అయి వరద నీరు రోడ్డుపై పారుతోంది. ఈ సమస్యను కేటీఆర్‌కు ఆయన హైస్కూల్ గురువు, లలితానగర్ అడిక్‌మెట్ రెసిడెన్షియల్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ ట్విట్టర్ వేదికగా తెలిపారు. తన గురువు చేసినభ్యర్థనపై వెంటనే స్పందించిన మంత్రి ఆ సమస్యను వెంటనే పరిష్కరించాలని ముషీరాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే ముఠా గోపాల్‌ను సూచించారు. అధికారులతో ఆయన ఆ ప్రాంతానికి వెళ్లి ఆ సమస్యను పరిశీలించి, పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించినట్లు తెలుస్తోంది.
విజ్ఞప్తులపై స్పందన..
హైదరాబాద్‌ను వర్షాలు, వరదలు ముంచెత్తాయి. దీంతో కాలనీలన్నీ సమస్యల్లో చిక్కుకుపోయాయి. మంత్రి కేటీఆర్.. తన గురువు చేసిన వినతి ఒక్కటే కాదు, చాలా మంది చేసిన ట్వీట్లకు కూడా మినిస్టర్ స్పందించి అధికారులకు తగు సూచనలు చేస్తున్నారు. ఇదిలా ఉంటే మంత్రి కేటీఆర్ ముంపుకు గురైన ప్రాంతాలను పర్యటించి బాధితులను ఆదుకునే చర్యలు చేపడుతున్నారు. వరదల కారణంగా చనిపోయిన వారి కుటుంబాలకు ఎక్స్ గ్రేషియ అందిస్తున్నారు.











