ఆస్ట్రేలియా వేదికగా బిగ్ బాష్ లీగ్ జరుగుతోంది. ఇందులో ఓ ఆటగాడు పట్టిన క్యాచ్ ప్రస్తుతం వైరల్ అవుతోంది. గాల్లో ఎగురుతూ.. ఒంటి చేత్తో అతడు క్యాచ్ పట్టిన విధానం ఔరా అనిపిస్తోంది. నెట్టింట ఆ ఆటగాడిపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అందరి మనసులూ దోచేసిన ఆ క్యాచ్ వీరుడెవరంటే…
ఒంటి చేత్తో ఒడిసి పట్టాడు..
ఆస్ట్రేలియాలో జరుగుతున్న బిగ్‌బాష్ లీగ్‌లో కళ్లు చెదిరే మరో క్యాచ్ ఇది. బ్రిస్బేన్ హీట్ ఆటగాడు బెన్ లాఫ్లిన్ ఒంటి చేత్తో పట్టిన క్యాచ్ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. క్యాచ్ అంటే.. ఇలా కూడా పట్టొచ్చా.. అనే ఆశ్చర్యం అందరిలోనూ నెలకొంది. అడిలైడ్ స్టైకర్స్‌తో జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ సంఘటన చోటు చేసుకుంది.
దటీజ్ లాఫ్లిన్..
మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. అంతలోనే ఆఫ్‌స్టంప్ అవతలకు లబుషేన్ వేసిన లో ఫుల్‌టాస్‌ను మైకేల్ నెసర్.. కవ్ కార్నర్ (డీప్ మిడ్ వికెట్-లాంగ్ ఆన్ మధ్యలో) మీదగా భారీ షాట్ ఆడాడు. లాంగ్‌ఆన్‌లో ఫీల్డింగ్ చేస్తున్న లాఫ్లిన్ పరిగెత్తుకుంటూ వెళ్లి గాల్లోకి ఎగిరి ఒంటిచేత్తో బంతిని ఒడిసిపట్టాడు. అందరి మనసునూ దోచేశాడు.
కాగా, ఎలిమినేటర్ మ్యాచ్‌లో అడిలైడ్‌పై బ్రిస్బేన్ ఆరు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్ చేసిన అడిలైడ్ నిర్ణీత 20 ఓవర్లకు ఏడు వికెట్ల నష్టానికి 130 పరుగులు చేసింది. అనంతరం బరిలోకి దిగిన బ్రిస్బేన్ 18.5 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది.
Must Read ;- ఇక్కడ క్రికెట్ కేవలం ఆట కాదు.. అంతకు మించి..











